close

తాజా వార్తలు

‘ట్రంప్‌ నన్ను లైంగికంగా వేధించారు’

యూఎస్‌ రచయిత్రి ఆరోపణలు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ఆ దేశ ప్రముఖ కాలమిస్ట్‌ ఈ.జీన్‌ కారోల్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎల్లీ ఫ్యాషన్‌ మేగజైన్‌లో కాలమ్స్‌ రాసే ఆమె..ట్రంప్‌ తనను లైంగికంగా వేధించేవారంటూ తన కథనంలో రాసుకొచ్చారు. తాజాగా ఆమె రాసిన పుస్తకం శుక్రవారం విడుదలైంది. అందులో తనకు సంబంధించిన ఓ కథనంలో ఈవిధంగా రాశారు. 90ల నాటి కాలంలో ఆయన తనతో ఎంతో స్నేహంగా మెలిగేవారని అందులో పేర్కొన్నారు. పుస్తకంలో పేర్కొన విషయం ప్రకారం..

‘1995 సమయంలో ట్రంప్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు. నేనేమో మేగజైన్‌ రచయిత్రిగా మంచి పేరు సంపాదించుకున్నాను. టీవీ ప్రెజెంటర్‌గానూ పనిచేసేదాన్ని. ఓసారి నేను, ట్రంప్‌ కలిసి మన్‌హట్టన్‌లోని స్టోర్‌కి షాపింగ్‌కి వెళ్లాం. అప్పుడు మేమిద్దరం మంచి స్నేహితులం. షాపింగ్‌కి వెళ్లిన స్టోర్‌లో ఆయన నాతో అభ్యంతరకరంగా మాట్లాడారు. దీంతో ఆయన నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాను. నేను డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్లగానే నాతో పాటు వచ్చి నాతో అసభ్యంగా ప్రవర్తించారు. ఆయన నామీద దాడి చేశారు. నేను ఆయనను తోసేసి పెద్దగా అరుస్తూ డ్రెస్సింగ్‌ రూమ్‌నుంచి బయటపడ్డాను. తర్వాత ఆయనతో ఎప్పుడూ మాట్లాడే ప్రయత్నం చేయలేదు. పోలీసులకి చెప్పాలనుకున్నప్పటికీ అప్పటి నాకున్న ఆదరణ కారణంగా చెప్పలేకపోయాను. దీంతో పాటు పోలీసులను ఆశ్రయిస్తే నాకేదయినా హాని జరుగుతుందని భయపడ్డాను. ఇలా ట్రంప్‌ అధ్యక్షుడు కాకముందు 15 మందిని వేధించారు’ అని కారోల్‌ తన పుస్తకంలో రాశారు.

 ఈ విషయంపై ట్రంప్‌ స్పందించారు. కారోల్ చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. దీనిపై ఆయన మాట్లాడారు. ‘ఆమెను ఇప్పటివరకు నేనెప్పుడూ కలవలేదు. ఆమెతో మాట్లాడనప్పుడు లైంగికంగా ఎలా వేధిస్తాను?తన కొత్త పుస్తకం బాగా అమ్ముడు పోవాలని నా గురించి రాసినట్లున్నారు. ఈ పుస్తకం ఫిక్షన్‌ సెక్షన్‌లో బాగా అమ్ముడుపోతుంది. నకిలీ వార్తలను ప్రచురించి మేగజైన్‌ డబ్బులు సంపాదించుకోవాలని చూస్తోంది’ అని అన్నారు. మరోవైపు ఈ అంశంపై వైట్‌ హౌస్‌ కూడా స్పందించింది. వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నందున ట్రంప్‌ను ఇప్పటి నుంచే ప్రజలకు చెడు అభిప్రాయం కలిగించేందుకు ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.