close

తాజా వార్తలు

ఆ బాధ్యత ఇప్పుడు వైకాపాపైనే ఉంది: గల్లా

దిల్లీ: గత ఐదేళ్లలో ఏపీకి ప్రత్యేక హోదా సాధనకు తెదేపా ఎంతగానో పోరాడిందని ఆ పార్టీ ఎంపీ గల్లా జయదేవ్‌ అన్నారు. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడారు. ‘హోదా’పై మాట తప్పినందుకే రాష్ట్రంలో భాజపా చిరునామా గల్లంతైందన్నారు. తెదేపా ప్రత్యేకహోదా సాధించలేదని భావించిన ప్రజలు.. వైకాపాకు ఒక్క అవకాశం ఇచ్చారని చెప్పారు. ప్రధానితో భేటీ అయిన ప్రతిసారీ హోదా ప్రస్తావన తెస్తానని సీఎం జగన్‌ చెప్పారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకూడదని ప్రధాని స్పష్టంగా ఉన్నారనే విషయం తమకు అప్పుడే అర్థమైందని జయదేవ్‌ వ్యాఖ్యానించారు. ఏ రాష్ట్రానికీ హోదా ఇచ్చేది అంశం పరిశీలనలో లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.  ఏపీ ప్రజలు వైకాపాకు స్పష్టమైన మెజారిటీ ఇచ్చారని.. ప్రత్యేక హోదా సాధించాల్సిన బాధ్యత ఇప్పుడు ఆ పార్టీపై ఉందన్నారు. 

అదేనా సబ్‌కా వికాస్‌?

స్వతంత్ర సంస్థలను ఉపయోగించుకుని భాజపా బెదిరింపు రాజకీయాలు చేస్తోందని జయదేవ్‌ ఆరోపించారు. ‘అందరూ భాజపాలో చేరడమే ఆ పార్టీ చెబుతున్న సబ్‌కా వికాస్‌కు అర్థమా?’ అని ఆయన ప్రశ్నించారు. రాజ్యసభలో నలుగురు తెదేపా ఎంపీలను విలీనం చేయడాన్ని లోక్‌సభలో గల్లా ప్రస్తావించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ.. అత్యవసర పరిస్థితిని తలపిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ విధానానికి అడ్డుకట్ట వేయకపోతే దేశ సమగ్రత, స్వతంత్రకు ముప్పు తప్పదన్నారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.