close

తాజా వార్తలు

ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియ ప్రారంభం

అమరావతి: ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాజధాని అమరావతిలో ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియ ప్రారంభమైంది. సీఎం ప్రకటించిన 24 గంటల్లో ఈ కట్టడం కూల్చివేతను ప్రారంభించిన సీఆర్డీయే అధికారులు ప్రస్తుతం ఆ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. జేసీబీలు, వంద మందికి పైగా కూలీలు కూల్చే పనిని చేపట్టారు. ఈ రాత్రి 7గంటలకు కూల్చివేతను ప్రారంభించిన కూలీలు అర్ధరాత్రి కల్లా పూర్తి చేయనున్నారు. ప్రజావేదికకు ఆనుకొని తాత్కాలిక టెంట్లను ఇప్పటికే పూర్తిగా తొలగించారు. వేదిక లోపల ఫర్నిచర్‌, ఏసీలు, ఇతర సాంకేతిక సామగ్రిని సచివాలయంలోని గోదాంకు తరలించారు. ప్రజావేదిక వద్ద ప్రహరీ గోడను జేసీబీతో కూల్చివేశారు. అక్కడ ఉన్న శిథిలాలను లారీలతో తరలిస్తున్నారు. ప్రజావేదికలో ముందుగా ఎలివేషన్‌ కోసం ఏర్పాటుచేసిన అల్యూమినియం ఫ్రేమ్‌లు, అద్దాలతో చేసిన ఉపకరణాలు, ద్వారాలను జాగ్రత్తగా తొలగించి వాటిని పునర్వినియోగించేందుకు సీఆర్డీయే అధికారులు ప్రయత్నిస్తున్నారు. 

రూ.కోట్ల ప్రజాధనాన్ని వ్యయం చేసి తెదేపా హయాంలో నిర్మించిన ఈ భవనం 2018లో అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సదస్సులతో పాటు ప్రభుత్వ సమావేశాలకు దీన్ని ఉపయోగిస్తూ వచ్చారు. అయితే, నిబంధనలకు విరుద్ధంగా వరద ప్రవాహ మట్టానికి దిగువన ఉండటంతో వైకాపా ప్రభుత్వం దీన్ని అక్రమకట్టడంగా తేల్చి కూల్చివేయాలని నిర్ణయించింది. సీఎం జగన్మోహన్‌ రెడ్డి 24 గంటల్లో కూల్చివేయాలని ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో సీఆర్డయే అధికారులు యుద్ధప్రాతిపదికన కూల్చివేతను వేగవంతం చేశారు. ఈ అర్ధరాత్రికి ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియను పూర్తిచేసే అవకాశం ఉంది. 

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.