close

తాజా వార్తలు

నాణ్యతకే కాదు.. హోదాకు ప్రతిరూపంగా..

కొల్హాపూరి పాదరక్షలకు భౌగోళిక గుర్తింపు

కొల్హాపూర్‌(మహారాష్ట్ర) : కొల్హాపూరి చెప్పులు.. తరాలు మారినా వీటిని ప్రత్యేకంగా వాడే వారు అధికంగా ఉంటారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ ప్రాంతంలో తయారు చేసే ఈ రకం చెప్పులకు అభిమానులు ఉంటారు. రాజకీయ నాయకులు సహా అనేక మంది వీటిపై మక్కువ చూపిస్తారు. గత కొంతకాలంగా వీటికి భౌగోళిక గుర్తింపు కోసం తయారీదారులు డిమాండ్‌ చేస్తూ వస్తుండగా ఎట్టకేలకు వీరి కల ఫలించింది. ఈ చెప్పులకు భౌగోళిక గుర్తింపు లభించింది. ఈ పాదరక్షలను తయారు చేసే మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ ప్రాంతంతోపాటు ఆ రాష్ట్రంలోని నాలుగు జిల్లాలు, కర్ణాటకలోని నాలుగు జిల్లాలకు ఈ భౌగోళిక గుర్తింపు వర్తించనుంది. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌, సోలాపూర్‌, సాంగ్లి, సతారా జిల్లాలు, కర్ణాటకలోని ధార్వాడ్‌, బాగల్‌కోట్‌, బీజాపూర్‌, బెల్గాం జిల్లాల్లోని ఉత్పత్తిదారులకు లాభించనుంది. మిగతా వాటికి కొల్హాపూరి అనే బ్రాండ్‌ లభించదు.

మహరాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఈ రకం చెప్పులను మొదటిసారి తయారు చేశారు. పూర్తిగా తోలుతోనే తయారు చేసే ఈ చెప్పులకు సహజసిద్ధ రంగులనే వాడతారు. ఈ పాదరక్షలకు మహారాష్ట్రలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. 13వ శతాబ్దం నుంచే వీటిని తయారు చేస్తున్నారని చెప్తారు. మొదట్లో రెండు కిలోల బరువుతో వీటిని తయారు చేసేవారు. ఆ చెప్పులు గట్టిగా ఉండేవి. ఎలాంటి వాతావరణంలోనైనా.. ఏ ప్రదేశంలోనైనా మనగలిగేవి. ప్రస్తుతం వీటి బరువు తగ్గించి నేటి యువతకు నచ్చే విధంగా తయారు చేస్తున్నారు. యువత కూడా ఆధునిక దుస్తులకు జోడీగా సంప్రదాయక కొల్హాపూరి చెప్పులను ధరిస్తున్నారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.