close

తాజా వార్తలు

విజయవాడలో పాఠశాల బస్సు బీభత్సం

విజయవాడ: విజయవాడ నగరంలో శనివారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. ఏలూరు రోడ్డులోని పాతబస్టాండ్‌ సమీపంలో ఆగివున్న కారును ప్రైవేటు పాఠశాల బస్సు ఢీకొంది. ఆ సమయంలో స్కూల్‌ బస్సులో 20 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఓ పాదచారుడికి స్వల్పగాయాలయ్యాయి. కారు నుజ్జునుజ్జయ్యింది. బస్సు డ్రైవర్‌కు ఫిట్స్‌ రావడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. గవర్నర్‌పేట ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.