
తాజా వార్తలు
హైదరాబాద్: ప్రముఖ నటుడు శర్వానంద్ వరుస సినిమాలతో జోరు మీదున్నారు. ఇప్పటికే ఆయన ‘రణరంగం’, ‘96’ రీమేక్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. తాజాగా తన 29వ చిత్రానికి పచ్చజెండా ఊపేశారు. సినిమాకు ‘శ్రీకారం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ క్లాప్‌నిచ్చారు. కిశోర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మించనున్నారు. ఆగస్టు నుంచి చిత్రీకరణ మొదలవుతుంది. 2020 సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
శర్వా నటిస్తున్న ‘రణరంగం’ ట్రైలర్ శనివారం విడుదలై మంచి స్పందన అందుకుంటోంది. ‘రణరంగం’ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా శర్వా ఇటీవల తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత కోలుకుని మళ్లీ చిత్రీకరణ మొదలుపెట్టారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- జయలలితగా రమ్యకృష్ణను చూశారా?
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- ‘అతను నన్ను చంపాలని చూస్తున్నాడు’
- రణ్‌బీర్‌కు ఆలియా అప్పుడే తెలుసు..!
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- భయం.. కోపం రెండూ వస్తున్నాయి!
- భారీ ప్రక్షాళనకు కార్యాచరణ
- అలాంటివాటిపై దృష్టి సారిస్తే నష్టమే:మమత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
