Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 120228
            [news_title_telugu_html] => 

లోక్‌సభలో సుమలత తొలి ప్రసంగం

[news_title_telugu] => లోక్‌సభలో సుమలత తొలి ప్రసంగం [news_title_english] => In her maiden speech Sumalatha says Centre must save Annadatas [news_short_description] => కర్ణాటకలోని మండ్య నియోజకవర్గం నుంచి ఎన్నికైన స్వతంత్ర ఎంపీ సుమలత అంబరీష్‌ తొలిసారిగా మంగళవారం లోక్‌సభలో ప్రసంగించారు. శూన్యగంట సమయంలో సుమలత రైతుల ఆత్మహత్యల అంశాన్ని లేవనెత్తారు. [news_tags_keywords] => Sumalatha,Loksabha session,Mandya [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-07-02 15:42:33 [news_isactive] => 1 [news_status] => 2 ) )
లోక్‌సభలో సుమలత తొలి ప్రసంగం - In her maiden speech Sumalatha says Centre must save Annadatas - EENADU
close

తాజా వార్తలు

లోక్‌సభలో సుమలత తొలి ప్రసంగం

దిల్లీ: కర్ణాటకలోని మండ్య నియోజకవర్గం నుంచి ఎన్నికైన స్వతంత్ర ఎంపీ సుమలత అంబరీష్‌ తొలిసారిగా మంగళవారం లోక్‌సభలో ప్రసంగించారు. శూన్యగంట సమయంలో సుమలత రైతుల ఆత్మహత్యల అంశాన్ని లేవనెత్తారు. అన్నదాతలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా మండ్యలో కరవు పరిస్థితులు, నీటి ఎద్దడి గురించి కూడా ప్రస్తావించారు. 

‘మండ్యలో ఇప్పటికే నీటి కొరత, కరవు పరిస్థితులు నెలకొన్నాయి. దీని వల్ల రైతులు ముఖ్యంగా చెరకు, వరి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతుల సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అన్నదాతలను కాపాడేందుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని ప్రధాని మోదీ, జల్‌శక్తి మంత్రిత్వ శాఖను కోరుతున్నా’ అని సుమలత తెలిపారు. ‘అన్నదాతలను ఆదుకోవాలి... జై జవాన్‌.. జై కిసాన్‌’ అని నినాదాలు చేస్తూ సుమలత తన ప్రసంగాన్ని ముగించారు.

ప్రముఖ నటి అయిన సుమలత తన భర్త అంబరీష్ మరణంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మండ్య లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి.. మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు నిఖిల్‌ కుమారస్వామిపై విజయం సాధించారు. తొలిసారిగా లోక్‌సభలో అడుగుపెట్టారు. అంబరీష్‌ కూడా గతంలో మండ్య నుంచి గెలుపొందారు. కాంగ్రెస్‌ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.