close

తాజా వార్తలు

బంగ్లా మ్యాచ్‌లో కోహ్లీసేన పవర్‌ప్లే రికార్డు

బర్మింగ్‌హామ్‌: ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ధాటిగా ఆడుతోంది. మ్యాచ్‌లో గెలిచి సెమీస్‌ బెర్త్‌ ఖాయం చేసుకోవాలన్న కసితో కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన ఓ రికార్డు నమోదు చేసింది. 2019 ప్రపంచకప్‌లో తన అత్యధిక పవర్‌ప్లే స్కోరు సాధించింది. 10 ఓవర్లకు వికెట్‌ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. అంతకు ముందు మాంచెస్టర్‌లో పాక్‌పై 53 చేయగా విండీస్‌పై 47/1తో నిలిచింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ క్రీజులో కుదురుకున్నారు. చక్కని బంతుల్ని గౌరవిస్తూ అందివచ్చిన బంతుల్ని కళ్లు చెదిరే సిక్సర్లు లేదా బౌండరీలుగా మారుస్తున్నారు. వీరిద్దరికీ ఇదే అత్యుత్తమ ఓపెనింగ్‌ భాగస్వామ్యం కావడం గమనార్హం.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.