close

తాజా వార్తలు

‘సుడి’ కుదరని గేల్‌

లీడ్స్‌: ‘యూనివర్స్‌ బాస్‌’ క్రిస్‌గేల్‌ను ఈ ప్రపంచకప్‌లో అదృష్టం వరించలేదు. అఫ్గాన్‌తో జరిగే చివరి మ్యాచ్‌లో అతడు మూడు రికార్డులును బద్దలు కొడతాడని అభిమానులు ఆశించారు. ఈ పోరులో గేల్‌ 18 పరుగులు చేస్తే దిగ్గజ ఆటగాడు బ్రియన్‌ లారా అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొట్టేవాడు. కానీ, 18 బంతులు ఆడిన గేల్‌ కేవలం 7 పరుగులే చేశాడు. లారా 295 వన్డేల్లో 10,348 పరుగులు చేశాడు. 294 మ్యాచుల్లో 10,331 పరుగులతో ఉన్న గేల్‌ ఆ సంఖ్యను 10,338కి మాత్రమే పెంచగలిగాడు. ఈ రికార్డు బద్దలయ్యేందుకు అతడు టీమిండియాతో సిరీస్‌ వరకు ఎదురుచూడాల్సిందే. ఇదే అతడికి చివరి సిరీస్‌.

ప్రపంచకప్‌ టోర్నీల్లో లారా మొత్తం 1225 పరుగులు చేశాడు. మరో 47 పరుగులు చేస్తే గేల్‌ ఈ ఘనతను అధిగమించేవాడు. అదీ కుదరలేదు. దిగ్గజ ఆటగాడు వివ్‌ రిచర్డ్స్‌ మెగాటోర్నీలో 3 శతకాలు సాధించి రికార్డు సృష్టించగా గేల్‌ రెండు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్‌లో శతకం చేసుకుంటే రిచర్డ్స్‌ను అతడు సమం చేసేవాడు. ఇక ఎంతమాత్రం ఈ రికార్డు గేల్‌కు సాధ్యం కాదు. అంతకు ముందు ఇంగ్లాండ్‌లోనే శతకాలతో మురిపించిన గేల్‌ ప్రపంచకప్‌లో మాత్రం అందరినీ నిరాశపరిచాడు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.