
తాజా వార్తలు
మాంచెస్టర్: చరిత్రను గమనిస్తే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాకు మరో ఓటమి తప్పేలా కనిపించడం లేదు. ఎందుకంటారా? ఆసీస్ విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ మూడోసారి తండ్రైన సంగతి తెలిసిందే. అతడి భార్య క్యాండిస్ ఆదివారం మూడో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. నాన్నైన ప్రతి సందర్భంలో వార్నర్ ప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. ఈ సారి సఫారీలతో తొలి మ్యాచ్ ఆడుతున్నాడు. అందులోనూ ఆ జట్టుతో అతడికి ప్రత్యేక అనుబంధం ఉంది!
వార్నర్ సతీమణి 2014లో మొదటి బిడ్డను ప్రసవించింది. ఐవీ మేకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా అతడు ప్రత్యర్థిపై అద్భుతంగా ఆడాడు. తొలి టెస్టు మ్యాచ్ ఆడి శతకం బాదేశాడు. 2016లో ఇండీ రే పుట్టింది. ఆ తర్వాత ఆడిన రెండు వన్డేల్లో డేవీ వరుసగా 93, 122తో చెలరేగాడు. ‘మూడో బిడ్డ పుట్టిన తర్వాతా అతడికి మరింత విజయం లభిస్తుందనే ఆశిస్తున్నా’ అని మాక్స్వెల్ అనడం ఇందుకేనని తెలుస్తోంది.
ఈ ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జూన్ 6న చివరి లీగ్ మ్యాచ్‌ను ఆడనుంది. ఇప్పటికే సెమీస్ చేరిన ఆసీస్ ఈ పోరులో విధ్వంసకరంగా ఆడే అవకాశం కనిపిస్తోంది. మూడో బిడ్డను చూడడానికి వెళ్లిన వార్నర్ గురువారం జట్టుతో కలిసి సాధన చేయనున్నాడు. మంచి ఫామ్‌లో ఉన్న అతడు ప్రపంచకప్‌లో 8 మ్యాచుల్లోనే 516 పరుగులు చేశాడు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే డేవీ కఠోరంగా సాధన చేస్తాడు. తీవ్రంగా శ్రమిస్తాడు. మ్యాచ్‌కు ముందు రోజు సాయంత్రం మాత్రం అస్సలు చేయడు. స్టీవ్‌స్మిత్, ఆరోన్ ఫించ్ మాత్రం ఇందుకు భిన్నంగా గంటల కొద్దీ సాధన చేస్తారు. దక్షిణాఫ్రికా సిరీస్‌లోనే డేవిడ్ వార్నర్, స్మిత్ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారు. ఏడాది నిషేధం అనుభవించారు. అసలే కసి మీదున్నాడు. సఫారీ బౌలింగ్‌కు ఊచకోత తప్పదనే అందరూ అనుకుంటున్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- కొండముచ్చు మృతితో గ్రామస్థుల కంటతడి
- వెస్టిండీస్ ఘన విజయం
- చైనా సూర్యుడు
- పునరుజ్జీవనం పొందిన వెనిషియన్ గాజు
- జపాన్‌లో రానా బర్త్‌డే సెలబ్రేషన్స్
- ‘పౌరసత్వ’ సెగ.. దిల్లీలో ఉద్రిక్తం
- ఉరితీసే అవకాశమివ్వండి.. రక్తంతో లేఖ
- చిన్నోడికి.. పెద్ద కష్టం..
- హైదరాబాద్‌లో విద్యార్థుల ఆందోళన
- బిర్యానీ అమ్మవద్దంటూ దళితుడిపై దాడి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
