
తాజా వార్తలు
ఆ దాడులు దారుణం: అమర్త్య సేన్
కోల్‌కతా: ‘జై శ్రీ రామ్’ నినాదాలు చెప్పమంటూ జరుగుతున్న దాడులపై ప్రముఖ ఆర్థిక వేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు.
‘బెంగాలీలకు ‘జై శ్రీ రామ్’ అనే పదంతో అంతగా అనుబంధం లేదు. అసలది బెంగాలీల సంప్రదాయమే కాదు. శ్రీరామనవమి ఇప్పుడిప్పుడే ప్రాధాన్యం సంతరించుకుంది. ఇంతకు ముందు నేనెప్పుడూ దీని గురించి వినలేదు. నాలుగేళ్ల నా మనవరాలిని నీకిష్టమైన దేవుడెవరు అని అడిగితే.. దుర్గామాత అనే చెబుతుంది. అమ్మవారు మన దైనందిన జీవితంలో అంతర్భాగం అయిపోయారు. శ్రీరాముడి పేరును అడ్డం పెట్టుకుని దాడులు చేయడం దారుణం’ అని అన్నారు.
పేదరికం గురించి మాట్లాడుతూ..‘ కేవలం పేదల ఆదాయాన్ని పెంచినంత మాత్రాన పేదరికం నుంచి బయట పడతామనేది జరగని పని. ఆరోగ్యం, విద్య, సామాజిక భద్రత మాత్రమే పేదరికాన్ని అరికట్టగలుగుతాయి’ అని అన్నారు.
ఈ మధ్య కాలంలో ‘జై శ్రీరామ్’ అనే నినాదాలు చేయలేదని దేశవ్యాప్తంగా దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో పాటు ఈ నినాదం రాసి ఉన్న 10 లక్షల పోస్టు కార్డులను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పంపుతామని భాజపా తెలిపిన విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో ఇది కాస్తా వివాదంగా మారి సంచలనానికి దారితీసింది. ఈ పరిణామాలన్నింటిపై అమర్త్యసేన్ మాట్లాడారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- మరోసారి నో చెప్పిన సమంత
- వైకాపాను నమ్మి మోసపోయారు:చంద్రబాబు
- కాకినాడలో పవన్ దీక్ష పేరు ఖరారు
- ఆ సంగతి తర్వాత చూద్దాం: రోహిత్
- మంత్రివర్గంలో వారికి చోటిస్తాం: యడియూరప్ప
- అప్పుడు శ్రీదేవి.. ఇప్పుడు జాన్వీ కపూర్
- సంజు శాంసన్ కోసం శశి థరూర్ ఆవేదన
- కోహ్లీ×విలియమ్స్: గెలుపెవరిదో చూడాలి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
