close

తాజా వార్తలు

యూపీలో రోడ్డు ప్రమాదం.. 8మంది మృతి

ఔరారియా: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఔరారియా ప్రాంతంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టెంపో, డీసీఎం వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో 8 మంది  మృతిచెందారు. మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబియాపూర్‌-బెలా రహదారిపై వెళుతున్న టెంపో వాహనం మరో వాహనాన్ని దాటి ముందుకు వెళ్లడానికి ప్రయత్నించి ఎదురుగా వస్తున్న డీసీఎంను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. 8 మంది అక్కడికక్కడే మరణించారని ఎస్పీ తెలిపారు. ముగ్గురు గాయపడగా వెంటనే వారిని ఆస్పత్రికి తరలించామన్నారు. ఈ ఘటనపై స్పందించిన ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.