close

తాజా వార్తలు

ట్రంప్‌ పాలనా..ఒక్క ముక్కలో చెప్పాలంటే..

ఇంటర్నెట్‌డెస్క్‌:  అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ పాలన అత్యంత ఘోరంగా ఉందని అమెరికాలోని బ్రిటన్‌ రాయబారి సర్‌ కిమ్‌ డరోచ్‌ పేర్కొన్నారు. ఆయన బ్రిటన్‌ ప్రభుత్వానికి పంపించిన నోట్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘‘ మనం ఇటువంటి పాలనను మనం నమ్మలేము. చాలా సాధారణంగా ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మొరటుగా ఉంది. ఎప్పుడైనా సమర్థంగా ఉంటుందేమో చూడాలి. జూన్‌లో ఆ దేశ అధ్యక్షుడి పర్యటన విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆయన కార్యవర్గం పూర్తి  స్వార్థంతో ఉంది. ఇరాన్‌ విషయంలో అమెరికా పాలసీ అస్తవ్యస్తంగా.. ఒక దిశానిర్దేశం లేకుండా ఉంది.’’ అని పేర్కొన్నారు. 
ఈ విషయాలను దిమెయిల్‌ పత్రిక ప్రచురించింది. ఈ విషయాన్ని యుకే విదేశాంగ శాఖ ఒక తుంటరి చర్యగా పేర్కొని ఊరుకొందే గానీ, ఖండించలేదు. దీనిపై శ్వేతసౌధం స్పందించలేదు. కానీ ఈ విషయం అమెరికా-యుకే మధ్య సంబంధాలను ప్రభావితం చేయవచ్చు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.