close

తాజా వార్తలు

పార్టీ నేతలకు మమతా బెనర్జీ చురకలు

ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆదేశాలు

కోల్‌కతా: సార్వత్రిక ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ సత్తా చాటలేకపోయింది. రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాల్లో తృణమూల్‌ కేవలం 22 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ హవా చూపించలేకపోయింది. భాజపా 18 స్థానాలు సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నష్ట నివారణ చర్యలు చేపట్టారు. వచ్చే ఏడాది అక్కడ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున సార్వత్రిక ఎన్నికల ప్రభావం ఉండకూడదని ఇప్పటి నుంచే మమతా అప్రమత్తమయ్యారు. ప్రజల పట్ల విధేయంగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. 

లోక్‌ సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తొలిసారిగా ఆమె పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దురుసుగా ప్రవర్తించి వివాదాల్లో నిలిచిన సీనియర్‌ నేతలపై మమత మండిపడినట్లు తెలిసింది. గతంలో చేసిన తప్పులకు నేతలందరూ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని సూచించినట్లు తెలుస్తోంది. పొరపాట్లను సరిదిద్దుకోవడానికి ఇదే సరైన తరుణమని పార్టీ నేతలకు చెప్పారు. 2021లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో  తృణమూల్ అఖండ విజయం సాధిస్తుందని మమత ధీమా వ్యక్తం చేశారు. భాజపా బెదిరింపులకు ఎంతమాత్రం బెదిరిపోయేది లేదని ఆమె స్పష్టం చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని దురుద్దేశంతో భాజపా వివిధ రాష్ట్రాల్లో అల్లర్లు సృష్టిస్తోందని ఆరోపించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.