close

తాజా వార్తలు

అమెరికా.. నిప్పుతో చెలగాటమొద్దు: చైనా

బుడాపెస్ట్ ‌(హంగరీ): తైవాన్‌ విషయంలో జోక్యం తగదని అమెరికాకు చైనాను హెచ్చరించింది. ఆ దేశానికి ఆయుధాలను అమ్మేందుకు అమెరికా సిద్ధమైన నేపథ్యంలో చైనా ఈ విధంగా స్పందించింది. నిప్పుతో చెలగాటమొద్దని ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్‌ అమెరికాను హెచ్చరించారు. హంగరీలో పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏ విదేశీ శక్తి పునరేకీకరణను ఆపలేదని ఆయన తైవాన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

స్వతంత్రంగా వ్యవహరిస్తున్న తైవాన్‌ తమదేశంలో అంతర్భాగమని చైనా ఎప్పట్నుంచో వాదిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా 2.2 బిలియన్‌ డాలర్ల విలువైన యుద్ధ సామగ్రిని తైవాన్‌కు విక్రయించేందుకు సిద్ధమైంది. దీనిపై చైనా మండిపడుతోంది. అమెరికా- చైనా బంధానికి కొత్త సమస్యలు సృష్టించాలని అమెరికా చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వాంగ్‌ హెచ్చరించారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.