close

తాజా వార్తలు

రైలు ప్రమాదం నుంచి మహిళను కాపాడిన జవాన్‌

అహ్మదాబాద్‌: కదులుతున్న రైలు ఎక్కబోయిన ఓ ప్రయాణికురాలు ప్రమాదవశాత్తూ ప్లాట్‌ఫాం మీద జారిపడింది. గమనించిన ఓ జవాన్‌, మరికొందరు అప్రమత్తమై ఆమెను పైకి లాగడంతో ప్రమాదం నుంచి బయటపడింది. ఓ ఆంగ్ల మీడియా ద్వారా ఈ ఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. 

అహ్మదాబాద్‌ రైల్వేస్టేషన్‌లో గురువారం రాత్రి 10:15గంటలకు పెద్ద బ్యాగ్‌తో ఓ ప్రయాణికురాలు కదులుతున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించింది. ప్రమాదవశాత్తూ ప్లాట్‌ఫాం నుంచి రైలు కింద పడిపోవడంతో అక్కడే ఉన్న ఓ ఆర్‌పీఎఫ్‌ జవాన్‌తో పాటు అప్రమత్తమై ఆమెను పైకి లాగారు. దీంతో ఆమె ప్రమాదం నుంచి బయటపడింది. గత నెల ఒడిశాలోని ఝర్సుగూడ రైల్వేస్టేషన్‌లో కదులుతున్న రైలు ఎక్కబోయి ప్లాట్‌ఫాం నుంచి జారిపడిన ఓ వ్యక్తి క్షేమంగా బయటపడిన సంగతి తెలిసిందే!


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.