
తాజా వార్తలు
లార్డ్స్: ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు కూడా కుమార ధర్మసేననే అంపైర్‌గా ఎంపికయ్యారు. మారియస్ ఎరాస్మస్‌తో కలిసి ఫైనల్ మ్యాచ్‌లో మరో ఫీల్డ్ అంపైర్‌గా ధర్మసేన వ్యవహరించనున్నారు. కీలక ఫైనల్ మ్యాచ్‌కు కూడా కుమార ధర్మసేననే మళ్లీ అంపైర్‌గా నియమించడం పట్ల సామాజిక మాధ్యమాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జేసన్ రాయ్(85).. అంపైర్ ధర్మసేన తప్పుడు నిర్ణయానికి బలైన సంగతి తెలిసిందే. కమిన్స్ బౌలింగ్‌లో బంతి రాయ్ బ్యాట్‌ను తాకుకున్నా ఆసీస్ ఆటగాళ్లు అప్పీలు చేయడంతో ఫీల్డ్ అంపైర్‌గా ఉన్న ధర్మసేన ఔట్ అంటూ వేలు ఎత్తాడు. రిప్లేలో మాత్రం బంతి రాయ్ చేతిని, బ్యాట్‌ను గానీ ఎక్కడా తాకలేదని తేలింది. అప్పటికే సమీక్షలు అయిపోవడంతో అంపైర్ నిర్ణయం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాయ్ మైదానాన్ని వీడాడు. అయితే మైదానంలో ఈ ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ప్రవర్తనకు మాత్రం ఐసీసీ చర్యలు తీసుకుంది. ప్రవర్తనా నియమావళి కింద అంపైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినందుకుగానూ మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధించడంతో పాటు అతడి ఖాతాలో రెండు డీమెరిట్ పాయింట్లు విధించింది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- విచారణ ‘దిశ’గా...
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- కొడితే.. సిరీస్ పడాలి
- ట్రాఫిక్‌లో ఆ పోలీసు ఏం చేశారంటే!
- ‘దిశ’ హత్యాచార కేసు నిందితుల మృతదేహాలు తరలింపు
- ఫేస్బుక్ సాయంతో కన్నవారి చెంతకు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
