close

తాజా వార్తలు

శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో ఛైర్మన్‌

తిరుమల: ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్‌-2 ప్రయోగం నేపథ్యంలో ఆ సంస్థ ఛైర్మన్‌ శివన్‌, పలువురు శాస్త్రవేత్తలు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. చంద్రయాన్‌-2 వాహకనౌక నమూనాకు శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రయోగం విజయవంతం కావాలని ప్రార్థించారు.అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శాస్త్రవేత్తలకు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా శివన్‌ మీడియాతో మాట్లాడుతూ.. జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3-ఎమ్‌1 వాహకనౌక ద్వారా చంద్రయాన్‌-2ను సోమవారం తెల్లవారుజామున 2.51 గంటలకు ప్రయోగిస్తామన్నారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.