close

తాజా వార్తలు

అమెరికాతో ఏమీ తేలలేదు..!

 దిల్లీలో ముగిసిన వాణిజ్య చర్చలు

దిల్లీ: అమెరికా-భారత్‌ వాణిజ్య చర్చలు పెద్దగా పురోగతి లేకుండానే దిల్లీలో నిన్న ముగిశాయి. ఇటీవల కాలంలో ఇరు దేశాలు పరస్పరం టారీఫ్‌లు విధించుకోవడం, రక్షణాత్మక చర్యలు తీసుకోవడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో దిల్లీలో జరిగిన చర్చల్లో వ్యవసాయ ఉత్పత్తులు, ఈ కామర్స్‌, స్టీల్‌, అల్యూమినియంలకు సంబంధించి పలు అంశాల్లో చిక్కుముడి ఉండటంతో వీటిపై  నిర్ణయాలను వాయిదా వేశారు. వచ్చే నెలలో వాణిజ్య, పరిశ్రమల శాఖ  మంత్రి పీయూష్‌ గోయల్‌ వాషింగ్టన్‌ వెళ్లనున్నారు. అక్కడ ఆయన అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్‌ లైట్జర్‌తో చర్చలు జరపనున్నారు. ఈ సందర్భంగా ఇప్పుడు తేలకుండా మిగిలిన అంశాలను ప్రస్తావిస్తారు. 
‘‘ఎటువంటి  పురోగతి లేదు’’ అని చర్చల్లో పాల్గొన్న ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఈ చర్చలు మూడు గంటల పాటు జరిగాయి. వాణిజ్య మంత్రి అమెరికా వెళ్లాకే చాలా విషయాలు పరిష్కారం అవుతాయని ఆయన పేర్కొన్నారు. కాకపోతే ప్రస్తుతం జరిగిన చర్చల్లో ఇరు పక్షాల ఆలోచనా తీరు ఎలా ఉన్నదో తెలుసుకోవడానికి ఉపయోగపడ్డాయి. 
ఈ చర్చలపై నిన్న కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య భయాలపై చర్చలను కొనసాగించాలని నిర్ణయించుకొన్నాయి.’’ అని ఈ ప్రకటనలో పేర్కొంది. 
ఇటీవల జీ20  సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌, భారత ప్రధాని నరేంద్ర మోదీలు ఇరుదేశాల బంధాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించుకొన్నారు. ‘భారత్‌తో భారీ వాణిజ్య ఒప్పందం  చేసుకోనున్నాం’ అని ట్రంప్‌ పేర్కొన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.