
తాజా వార్తలు
దినేశ్ కార్తిక్‌కు కూడా చాలా అవకాశాలు ఇచ్చారు
ముంబయి: ప్రపంచకప్ ముందు నుంచి నాలుగో నంబర్ స్థానంపై ఆందోళన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సెమీస్‌లో ఓడిపోయి టీమిండియా మెగా ఈవెంట్ నుంచి నిష్క్రమించింది. ఆ స్థానంలో అనేక మంది ఆటగాళ్లని పరీక్షించినా సరైన ఆటగాడిని తయారు చేయడంలో బీసీసీఐ విఫలమైందినే విమర్శలు వస్తున్నాయి. విజయ్‌శంకర్, మనీష్‌పాండే, సీనియర్ ఆటగాళ్లు దినేశ్ కార్తిక్, అంబటి రాయుడును నాలుగో స్థానంలో ఆడించినా ఆ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారు.
ఇలాంటి పరిస్థితుల్లోనే టీమిండియా అంబటిరాయుడుని కాదని విజయ్‌శంకర్‌తో ప్రపంచకప్ టోర్నీకి వెళ్లింది. కాగా శంకర్ మెగా టోర్నీలో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా గాయం కారణంగా వెనుతిరగడంతో మయాంక్ అగర్వాల్‌ని ఎంపిక చేశారు. దీంతో మనస్తాపం చెందిన అంబటి రాయుడు క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో బీసీసీఐపై అనేక విమర్శలు వచ్చాయి.
కాగా టీమిండియా యాజమాన్యం రాయుడుని ప్రపంచకప్‌కు ఎంపిక చేయకపోవడం సరైన నిర్ణయమేనని బీసీసీఐ మాజీ సెక్రటరీ సంజయ్ జగ్దాల్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రాయుడు, దినేశ్కార్తిక్లకు అనేక అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయారని తెలిపారు. సెలక్షన్ కమిటీ విజయ్‌శంకర్, అంబటిరాయుడు, దినేశ్‌కార్తిక్‌లను చాలా పరీక్షించిందని చెప్పారు. అలాగే 2003లో తాను సెలెక్టర్‌గా ఉన్నప్పటి నుంచి కార్తిక్, రాయుడు ఆడుతున్నారని, కేవలం ఐపీఎల్ ప్రదర్శన ప్రామాణికంగా వారిని ఎంపిక చేయడం సరైంది కాదని పేర్కొన్నారు.
తొలి జాబితాలో పంత్‌ను ఎంపిక చేయకపోవడంపై తాను ఆశ్చర్యపోయానని సంజయ్ తెలిపారు. అలాగే మనీష్‌పాండే, శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్లకు అవకాశం రాకపోవడం దురదృష్టకరమని, అందుకు తాను చింతిస్తున్నానని తెలిపారు. ఇక రాయుడు, కార్తిక్‌లకు అనేక అవకాశాలు వచ్చినా నిరూపించుకోలేదని, వారి పట్ల ఎలాంటి పశ్చాత్తాపం లేదని మాజీ అధికారి వివరించారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయా?
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- శ్వేతసౌధంలో ఏకాకి!
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
- ఎస్కేయూ ఉపకులపతి జయరాజ్ హఠాన్మరణం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
