
తాజా వార్తలు
లండన్: ఇంతకుముందు ఇంగ్లాండ్ జట్లతో పోల్చుకుంటే ప్రస్తుత మోర్గాన్ సారథ్యంలో జట్టే వన్డే ఫార్మాట్లో అత్యుత్తమ జట్టు అని ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్ వా అన్నాడు. ప్రపంచకప్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా ఆదివారం ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ పోరు జరగనుంది. ఫైనల్లో మోర్గాన్ సేన కివీస్‌పై విజయం సాధిస్తే ప్రపంచకప్ అందుకున్న తొలి ఇంగ్లాండ్ జట్టుగా చరిత్రలో నిలిచిపోతుందని స్టీవ్ వా పేర్కొన్నాడు. మరోవైపు న్యూజిలాండ్ పరిస్థితి కూడా ఇంతే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ప్రస్తుత ఇంగ్లాండ్ జట్టు భయం లేని ప్రదర్శనతో మెప్పిస్తుంది. క్రికెట్ వంటి క్రీడలో ఇది కష్టంతో కూడుకున్న పని. ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ ఇలా ప్రతి విభాగంలోనూ మోర్గాన్ సేన పటిష్టంగా కనిపిస్తోంది. నేను చూసిన జట్లలో ఇదే అత్యుత్తమ జట్టు.’ అని చెప్పుకొచ్చాడు.
‘అద్భుత ఫామ్‌లో ఉన్న ఓపెనర్ జేసన్ రాయ్, ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆ జట్టుకు కీలకం కానున్నారు. వీరితోపాటు ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ కూడా విలువైన ఆటగాడే. తొలిసారి ట్రోఫీ అందుకోవాలనుకుంటున్న న్యూజిలాండ్‌కు కూడా ఈ మ్యాచ్ కీలకమే. దీంతో ఫైనల్ పోరు ఆసక్తికరంగా సాగుతుంది.’ అని ఆసీస్ మాజీ సారథి అభిప్రాయపడ్డాడు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ఆరిఫ్, చెన్నకేశవుల చేతిలో తుపాకులు!
- ‘న్యాయపరంగా వెళ్తే బాగుండేది’
- నిందితులు రాళ్లు,కర్రలతో దాడి చేశారు:సజ్జనార్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
