close

తాజా వార్తలు

మేం ఫైనల్స్‌కి చేరటమే ఎక్కువ

ఫలితం గురించి ఆలోచించి ఒత్తిడికి గురవదలచుకోలేదు : ఇయాన్‌ మోర్గాన్‌

లండన్‌: మే 30 నుంచి నిర్విరామంగా సాగుతున్న ఐసీసీ 12వ వన్డే ప్రపంచకప్‌ వేడుక ఆఖరి ఘట్టానికి చేరుకుంది. మరికొన్ని గంటల్లో ఇంగ్లాండ్‌ X న్యూజిలాండ్‌ జట్ల మధ్య ఫైనల్స్ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లూ ప్రపంచకప్‌ గెలవకపోవడంతో ఈ రోజు ఎవరు గెలుపొందినా చరిత్ర సృష్టిస్తారు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆతిథ్య జట్టు కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ మాట్లాడుతూ తమ జట్టు ప్రపంచకప్‌ ఫైనల్స్‌కు చేరడమే ఎక్కువగా భావిస్తున్నామని చెప్పాడు. ఫలితం గురించి ఆలోచించి అనవసరంగా ఒత్తిడికి గురవదలచుకోలేదని తెలిపాడు.

‘ట్రోఫీని గెలుచుకునే విషయంపై ప్రస్తుతం నేను ఆలోచించడం లేదు. ప్రస్తుతం నేను చాలా ప్రశాంతంగా ఉన్నా. అలాగే ఫైనల్స్‌లో ఆడటం కోసం ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నా. ఏది ఏమైనా మేం ఆటని ఆస్వాదించాలనుకుంటున్నాం. మా జట్టులోని ప్రతీ ఆటగాడు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండటం శుభపరిణామం’ అని పేర్కొన్నాడు.

అలాగే లార్డ్స్‌ మైదానంలో పరుగుల వరద పారే అవకాశం లేదని,  ఇరు జట్ల మధ్య పోటాపోటీ ఉంటుందని చెప్పాడు. కాగా ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌ జట్లు ఇదివరకు ఎనిమిదిసార్లు తలపడగా మూడు సార్లు ఆతిథ్యజట్టు, ఐదుసార్లు కివీస్‌ జట్టు గెలుపొందాయి. అయితే లీగ్‌ దశలో కివీస్‌పై 119 పరుగుల భారీ విజయం సొంతం చేసుకున్న ఇంగ్లాండ్‌ ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లోనూ ఫేవరెట్‌గా కనిపిస్తోంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.