close

తాజా వార్తలు

సెలెక్టర్లపై బీసీసీఐ అసంతృప్తి

ఓటమిపై వాళ్లూ బాధ్యత తీసుకోవాలి

ముంబయి: ప్రపంచకప్‌లో టీమిండియా ఓటమికి సెలెక్షన్‌ కమిటీ నిర్ణయాలే ప్రధాన కారణమని బీసీసీఐ ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సెలెక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌పై బీసీసీఐ అధికారులు గుర్రుగా ఉన్నారని అర్థమవుతోంది. ప్రపంచకప్ లాంటి మెగా ఈవెంట్‌కు కీలకమైన నాలుగో నంబర్‌ ఆటగాడిని ఎంపిక చేయడంలో విఫలమయ్యారని బీసీసీఐ అధికారులు భావిస్తున్నారు. ప్రపంచకప్‌లో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ గాయం కారణంగా దూరమైన విషయం తెలిసిందే. ఆ సమయంలో టెస్టు ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ని రోహిత్‌కు జోడీగా ఎంపిక చేయడంతో పాటు విజయ్‌శంకర్‌ని నాలుగో స్థానంలో ఆడించారు. అనంతరం అతడికి గాయమైతే మరో టెస్టు క్రికెటర్‌ మయాంక్‌ అగర్వాల్‌ని ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో కీలక స్థానంలో సరైన ఆటగాడిని ఎంపిక చేయడంలో సెలెక్షన్‌ కమిటీ సభ్యులు విఫలమయ్యారని బీసీసీఐ అధికారులు అసంతృప్తితో ఉన్నారు.

ఈ విషయంపై స్పందించిన ఓ బీసీసీఐ అధికారి.. టీమిండియా ఓటమికి సెలెక్షన్‌ కమిటీ బాధ్యత తీసుకోవాలని తెలిపారు. జట్టు ఏదైనా సిరీస్ లేదా టోర్నీ గెలిస్తే ఆర్థిక రివార్డు పొందే సెలెక్టర్లు.. ఓటమి ఎదురైనప్పుడు కూడా బాధ్యత తీసుకోవాలి. అయితే టీమిండియా ఓడిపోయినప్పుడు ఆటగాళ్లే విమర్శలకు గురౌతున్నారని ఆయన అన్నారు. సెలెక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ ఎప్పుడూ జట్టుతో కలిసి ఉంటాడని, నాలుగో నంబర్‌లో ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై ఆయనకు సరైన అవగాహన ఉండాల్సిందని చెప్పారు. ప్రపంచకప్‌కు తొలి జాబితా ప్రకటించినప్పటి నుంచి టోర్నీలో ఆటగాళ్ల మార్పుల వరకూ జట్టు అవసరాలకు తగ్గట్టు కాకుండా సెలెక్షన్‌ కమిటీ సభ్యులే అన్ని నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.