
తాజా వార్తలు
ఓటమిపై వాళ్లూ బాధ్యత తీసుకోవాలి
ముంబయి: ప్రపంచకప్‌లో టీమిండియా ఓటమికి సెలెక్షన్ కమిటీ నిర్ణయాలే ప్రధాన కారణమని బీసీసీఐ ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్‌పై బీసీసీఐ అధికారులు గుర్రుగా ఉన్నారని అర్థమవుతోంది. ప్రపంచకప్ లాంటి మెగా ఈవెంట్‌కు కీలకమైన నాలుగో నంబర్ ఆటగాడిని ఎంపిక చేయడంలో విఫలమయ్యారని బీసీసీఐ అధికారులు భావిస్తున్నారు. ప్రపంచకప్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్ గాయం కారణంగా దూరమైన విషయం తెలిసిందే. ఆ సమయంలో టెస్టు ఓపెనర్ కేఎల్ రాహుల్‌ని రోహిత్‌కు జోడీగా ఎంపిక చేయడంతో పాటు విజయ్‌శంకర్‌ని నాలుగో స్థానంలో ఆడించారు. అనంతరం అతడికి గాయమైతే మరో టెస్టు క్రికెటర్ మయాంక్ అగర్వాల్‌ని ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో కీలక స్థానంలో సరైన ఆటగాడిని ఎంపిక చేయడంలో సెలెక్షన్ కమిటీ సభ్యులు విఫలమయ్యారని బీసీసీఐ అధికారులు అసంతృప్తితో ఉన్నారు.
ఈ విషయంపై స్పందించిన ఓ బీసీసీఐ అధికారి.. టీమిండియా ఓటమికి సెలెక్షన్ కమిటీ బాధ్యత తీసుకోవాలని తెలిపారు. జట్టు ఏదైనా సిరీస్ లేదా టోర్నీ గెలిస్తే ఆర్థిక రివార్డు పొందే సెలెక్టర్లు.. ఓటమి ఎదురైనప్పుడు కూడా బాధ్యత తీసుకోవాలి. అయితే టీమిండియా ఓడిపోయినప్పుడు ఆటగాళ్లే విమర్శలకు గురౌతున్నారని ఆయన అన్నారు. సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ ఎప్పుడూ జట్టుతో కలిసి ఉంటాడని, నాలుగో నంబర్లో ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై ఆయనకు సరైన అవగాహన ఉండాల్సిందని చెప్పారు. ప్రపంచకప్‌కు తొలి జాబితా ప్రకటించినప్పటి నుంచి టోర్నీలో ఆటగాళ్ల మార్పుల వరకూ జట్టు అవసరాలకు తగ్గట్టు కాకుండా సెలెక్షన్ కమిటీ సభ్యులే అన్ని నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- మరోసారి నో చెప్పిన సమంత
- వైకాపాను నమ్మి మోసపోయారు:చంద్రబాబు
- కాకినాడలో పవన్ దీక్ష పేరు ఖరారు
- అప్పుడు శ్రీదేవి.. ఇప్పుడు జాన్వీ కపూర్
- ఆ సంగతి తర్వాత చూద్దాం: రోహిత్
- 8 మంది.. 8 గంటలు
- సంజు శాంసన్ కోసం శశి థరూర్ ఆవేదన
ఎక్కువ మంది చదివినవి (Most Read)
