close

తాజా వార్తలు

హువావేలో భారీగా ఉద్యోగాలకు కోత

వాషింగ్టన్‌: టెలికామ్‌ దిగ్గజం హువావే అమెరికాలో భారీగా ఉద్యోగులను తగ్గించుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. అమెరికా ఈ సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చడంతో ఆ సంస్థ అవస్థలు పడుతోంది. దీంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అమెరికాలోని పరిశోధనా, అభివృద్ధి విభాగమైన ఫ్యూచర్‌వే టెక్నాలజీలోని 850 మందిని తొలగించవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే ఫ్యూచర్‌వే కంపెనీలో ఉద్యోగులను హువావేలోని తమ సహచరులతో ఫోన్‌లో మాట్లాడకుండా ఆంక్షలు విధించారు.  మే16నుంచి ఈ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. 
ఇక్కడ చిన్న మెలిక ఉంది. హువావేలో పనిచేస్తున్న అమెరికన్లను మాత్రం తొలగించనున్నట్లు తెలిసింది. ఇక చైనీయులకు మాత్రం స్వదేశంలో పనిచేసే అప్షన్‌ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ విషయంన్ని కంపెనీకి చెందిన అధికారి ఒకరు వెల్లడించారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.