close

తాజా వార్తలు

తొలిసారి పుట్టినింటికి చేరిన ప్రపంచకప్‌

లార్డ్స్‌: నరాలు తెగే ఉత్కంఠ. బంతి బంతికి ఎక్కడ లేని ఉద్వేగం. నెల రోజులకు పైగా సాగిన మహా సంగ్రామం ఆఖరి రోజు మాత్రం మామూలు ఆనందం పంచలేదు. సగటు క్రికెట్‌ అభిమాని గుండెల్లో నిలిచిపోయేలా సాగింది ఈ మ్యాచ్‌. ముందుగా బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్‌ కూడా 50 ఓవర్లలో 241 పరుగులకే ఆలౌటైంది. స్టోక్స్‌(84నాటౌట్‌; 98బంతుల్లో 5×4, 2×6) గొప్ప పోరాటం చేశాడు.దీంతో మ్యాచ్‌ టై కావడంతో సూపర్‌ ఓవర్‌కు దారితీసింది. సూపర్‌ ఓవర్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ 6 బంతుల్లో 15 పరుగులు చేసింది. ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌ కూడా 6 బంతుల్లో 15 పరుగులు చేసింది. దీంతో సూపర్‌ ఓవర్‌ కూడా టైగా ముగిసింది. దీంతో  ఐసీసీ నిబంధనల  ప్రకారం మ్యాచ్‌లో ఎక్కువ బౌండరీలు సాధించిన జట్టు విజేతగా నిలుస్తుంది. అత్యధిక బౌండరీలు సాధించడంతో ఇంగ్లాండ్‌ జగజ్జేతగా నిలిచింది.  


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.