
తాజా వార్తలు
మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్
లండన్: ఐసీసీ 12వ ప్రపంచకప్ కథ ముగిసింది. ఇంగ్లాండ్ విశ్వవిజేతగా నిలిచింది. ఆ జట్టుకు నాలుగు దశాబ్దాల కల నెరవేరింది. న భూతో.. న భవిష్యత్! అనే రీతిలో సాగిన ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ X న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల మధ్య గెలుపు ఎంత దోబూచులాడిన క్రికెటే అసలైన విజేతగా నిలిచింది. యావత్ క్రికెట్ ప్రేమికుల్ని మునివేళ్లపై నిలిపిన ఈ ఫైనల్ ప్రపంచకప్ చరిత్రకే తలమానికంగా మారింది.
తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 241 పరుగులు చేయగా లక్ష్య ఛేదనలో ఆతిథ్య జట్టు సైతం 241 పరుగులు చేసింది. నరాలు తెగే ఉత్కంఠలో మ్యాచ్ టైగా ముగిసినా అంపైర్లు సూపర్ ఓవర్‌కి తెరతీశారు. ఇక్కడ తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 15 పరుగులు చేయగా అనంతరం న్యూజిలాండ్ కూడా వికెట్ నష్టానికి 15 పరుగులు చేసింది. అయితే మ్యాచ్‌లో ఎక్కువ బౌండరీలు కొట్టిన మోర్గాన్‌సేన జగజ్జేతగా నిలిచింది.
మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్ మాట్లాడుతూ.. తమ జట్టు బ్యాటింగ్ చేస్తుండగా క్రిస్‌వోక్స్ ఔటైనప్పుడే ప్రపంచకప్‌ను కోల్పోయామని అనుకున్నానని చెప్పాడు. ఆఖరి ఓవర్లో విసిరిన త్రో స్టోక్స్ బ్యాట్‌కు తగిలి బౌండరీ చేరడంతో తిరిగి తమ జట్టులో ఆశలు చిగురించాయని అన్నాడు. ఇక సూపర్ ఓవర్లో బెన్‌స్టోక్స్, బట్లర్ బాగా ఆడారని మెచ్చుకున్నాడు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- ‘న్యాయంగా రాజమౌళి సినిమాలో నన్ను పెట్టాలి’
- పెళ్లైన ఏడాదికే భర్తతో విడిపోయిన శ్వేతా బసు
- వైకాపాను నమ్మి మోసపోయారు:చంద్రబాబు
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- మరోసారి నో చెప్పిన సమంత
- కాకినాడలో పవన్ దీక్ష పేరు ఖరారు
- ‘వెంకీ మామ’ టీంతో రానా ముచ్చట్లు
- ‘ఆర్ఆర్ఆర్’ ఎన్టీఆర్ ఫొటో వైరల్!
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
