Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 126905
            [news_title_telugu_html] => 

లోక్‌సభలో సరోగసీ బిల్లు..

[news_title_telugu] => లోక్‌సభలో సరోగసీ బిల్లు.. [news_title_english] => Govt introduces bill to ban commercial surrogacy [news_short_description] => భారత్‌లో కమర్షియల్‌ సరోగసీ (అద్దె గర్భం) విధానంపై త్వరలోనే నిషేధం విధించే అవకాశం ఉంది.   [news_tags_keywords] => surrogacy,New Delhi,Lok Sabha [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-07-15 18:47:08 [news_isactive] => 1 [news_status] => 2 ) )
లోక్‌సభలో సరోగసీ బిల్లు.. - Govt introduces bill to ban commercial surrogacy - EENADU
close

తాజా వార్తలు

లోక్‌సభలో సరోగసీ బిల్లు..

న్యూదిల్లీ: భారత్‌లో కమర్షియల్‌ సరోగసీ (అద్దె గర్భం) విధానంపై త్వరలోనే నిషేధం విధించే అవకాశం ఉంది. ఇందుకు తగ్గ విధానాలు రూపొందించిన కేంద్ర ప్రభుత్వం.. సోమవారం లోక్‌సభలో సరోగసీ (నియంత్రణ) బిల్లును-2019ని ప్రవేశపెట్టింది. కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ విధానం ద్వారా శిశువును పొందాలని అనుకునే దంపతులు ఇందుకు తగ్గ ‘నైతిక నిస్వార్థ’ సేవల కోసం తమ బంధువుల సాయాన్ని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ బిల్లు ఆమోదం పొందితే కేంద్ర, రాష్ట్రాల స్థాయిల్లో చట్టబద్ధమైన సరోగసీ బోర్డులు ఏర్పాటవుతాయి. 

ఈ విధానం ద్వారా శిశువుని పొందిన వారు.. భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బిడ్డను వదులుకోకూడదు. గతంలో లోక్‌సభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. అయితే, 16వ లోక్‌సభ రద్దుతో ఆ బిల్లు మరుగునపడింది. దీంతో మళ్లీ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. చట్టబద్ధంగా వివాహం జరిగి ఐదేళ్లు నిండిన భారతీయ దంపతులు మాత్రమే సరోగసీ విధానం ద్వారా బిడ్డను పొందొచ్చు. సరోగేట్‌ విధానం ద్వారా ఒక మహిళ ఒకేసారి బిడ్డను కనాలి. అలాగే, దంపతులకు ఆ మహిళ సన్నిహిత బంధువై ఉండాలి. భారత్‌లో సరోగసీపై చాలా కాలంగా ఆందోళనకర విషయాలు వెల్లడవుతున్న విషయం తెలిసిందే.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.