
తాజా వార్తలు
ఆటగాళ్లకు ప్రత్యేక విందు ఇచ్చిన థెరిసా మే
లండన్: ప్రపంచకప్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు సోమవారం బ్రిటన్ ప్రధాని థెరిసా మే ని కలిశారు. డౌనింగ్ స్ట్రీట్‌లోని ఆమె కార్యాలయం వద్ద ప్రపంచకప్‌తో పాటు ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా ప్రధాని ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో ఆటగాళ్లు పాల్గొని సంతోషంగా గడిపారు. ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఇంగ్లాండ్ ఆటగాళ్ల ప్రదర్శన అద్భుతమని, దేశ క్రీడా చరిత్రలో ఈ విజయం ఎప్పటికీ గుర్తుండిపోతుందని ప్రధాని అధికార ప్రతినిధి పేర్కొన్నారు.
ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇరు జట్ల స్కోర్లు సమం కాగా బౌండరీల సంఖ్య ప్రమాణికంగా ఇంగ్లాండ్ జట్టు నూతన ఛాంపియన్‌గా అవతరించింది. దీంతో 44 ఏళ్ల ఇంగ్లాండ్ సుధీర్ఘ కల సాకారమైంది. ఇయాన్‌మోర్గాన్ నేతృత్వంలోని జట్టు ప్రదర్శన చూసి రాబోయేకాలంలో ఎంతో మంది చిన్నారులు స్ఫూర్తి పొందుతారని, అలా బ్యాట్ పట్టి భవిష్యత్ ఛాంపియన్లుగా నిలుస్తారనే విషయం ఊహించుకోడానికే అద్భుతంగా ఉందని ప్రధాని ప్రతినిధి పేర్కొన్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ఆ ‘ఈగ’ పరమ అసహ్యంగా ఉంది!
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- విశ్వసుందరి.. జోజిబిని టుంజీ
- ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయా?
- ఆ ఉరితాళ్లు.. నిర్భయ దోషులకేనా?
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- గుర్రమెక్కుతుంటే బాదేశారు... తాళి కడుతుంటే ఆపేశారు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
