
తాజా వార్తలు
లండన్: ఐసీసీ వన్డే ప్రపంచకప్ ముగిసింది. ఇంగ్లాండ్ విశ్వవిజేతగా ఆవిర్భవించింది. ఉత్కంఠతో ఊపేసిన ఫైనల్ టై అయింది. ఈ పోరులో గప్తిల్ విసిరిన బంతి బెన్‌స్టోక్స్ బ్యాటుకు తాకి బౌండరీకి చేరిన సంగతి తెలిసిందే. ఐదు పరుగులే ఇవ్వాల్సిన చోట మొత్తం ఆరు పరుగులు ఇవ్వడంతో అంపైర్లను తీవ్రంగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇది మరో వివాదానికి దారితీసింది. అప్పట్లో ఫుట్‌బాల్ ఛాంపియన్ డిగో మారడోనా ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ వివాదంతో బెన్‌స్టోక్స్ ‘బ్యాట్ ఆఫ్ గాడ్’ను పోలుస్తున్నారు.
ఫైనల్లో ఆఖరి ఓవర్లో విజయం కోసం ఇంగ్లాండ్, న్యూజిలాండ్ పోరాటం నభూతో న భవిష్యతి! ట్రెంట్ బౌల్ట్ వేసిన తొలి రెండు బంతులకు పరుగులేమీ రాలేదు. మూడో బంతికి సిక్సర్ బాదిన స్టోక్స్ మ్యాచ్‌ను మళ్లీ మలుపు తిప్పాడు. నాలుగో బంతినీ భారీ సిక్సర్ బాదాలని ప్రయత్నించాడు. కానీ కుదర్లేదు. డీప్ మిడ్వికెట్లో బంతిని అందుకున్న ఫీల్డర్ గప్తిల్ కీపర్ ఎండ్‌లోకి విసిరాడు. అప్పటికే క్రీజుకు కాస్త దూరంలో ఉన్న స్టోక్స్ గాల్లోకి డైవ్ చేశాడు. ఆ సమయంలో బ్యాటుకు తాకిన బంతి ఓవర్ త్రో రూపంలో నేరుగా బౌండరీ దాటింది. ఇది స్టోక్స్ ఉద్దేశపూర్వకంగా చేయలేదు. ఇప్పుడీ సంఘటనను ఒకప్పటి మారడోనా ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’తో పోలుస్తున్నారు.
ఫిఫా ప్రపంచకప్-1986లో ఇంగ్లాండ్‌తో క్వార్టర్ ఫైనల్లో అర్జంటీనా దిగ్గజం డిగో మారడోనా ఓ వివాదాస్పద గోల్ చేశాడు. గెలుపు గోల్ చేసేందుకు తలతో పాటు పిడికిలిని ఉపయోగించాడు. ఇంగ్లాండ్ ఆటగాళ్లు రిఫరీకి మొరపెట్టుకున్నా ఏం లాభం లేకపోయింది. ఆ తర్వాత డిగో మాట్లాడుతూ ‘కాస్త తలతో కాస్త దేవుడి చేతితో గోల్ చేశాను’ అని చెప్పాడు. ఇప్పుడు దీనికి లంకె పెడుతూ స్టోక్స్‌ను ఉద్దేశించి ‘బ్యాట్ ఆఫ్ గాడ్’ అంటున్నారు. ట్విటర్లో వ్యంగ్యంగా వ్యాఖ్యలు, చిత్రాలు పెడుతున్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- విజృంభించిన విరాట్.. టీమిండియా విజయం
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- హక్కులు మనుషులకు.. మృగాళ్లకు కాదు!
- కిర్రాక్ కోహ్లి
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- ఆయుధాలు ప్రదర్శనకు కాదు:మీనాక్షి లేఖి
- రజాక్‌కు పఠాన్ చురకలు
- అజిత్ పవార్‌కు క్లీన్చిట్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
