
తాజా వార్తలు
భారత్‌లో ప్రపంచకప్‌నకు న్యూజిలాండ్ ఫేవరెట్: వెటోరీ
లండన్: ఒక ఫైనల్ మ్యాచ్ రెండు సార్లు టై కావడం క్రేజీగా అనిపిస్తోందని న్యూజిలాండ్ మాజీ ఆటగాడు డేనియెల్ వెటోరీ అన్నాడు. భారత్‌లో 2023లో జరిగే ప్రపంచకప్‌లో కివీస్ ఎందుకు ఫేవరెట్ కాకూడదని ప్రశ్నించాడు. ప్రస్తుత జట్టు అప్పటికి మరింత అనుభవం సాధిస్తుందని వెల్లడించాడు.
‘న్యూజిలాండ్‌ను చూస్తుంటే వచ్చే నాలుగేళ్లలో పెద్ద మార్పులేమీ ఉండవు. ఇప్పుడున్న ఆటగాళ్లే తర్వాత ప్రపంచకప్‌నకు అందుబాటులో ఉంటారు. వారు అనుభవం సంపాదించి మరింత మెరుగై తిరిగొస్తారు. అలాంటప్పుడు భారత్‌లో టైటిల్ కోసం వీరు పోటీలో ఉండకపోవడానికి ఎలాంటి కారణాలు లేవు. ఈ ప్రపంచకప్‌లో కివీస్‌కు ట్రోఫీ రాకపోయినప్పటికీ అద్భుతమైన ప్రదర్శనతో వారు గర్వంగా ఇంటికి తిరిగొస్తారు. విజయం రెండు జట్లతో దోబూచులాడింది. ఆధిపత్యం సాంతం చేతులు మారింది’ అని వెటోరీ అన్నాడు.
‘ప్రపంచకప్ ఫైనల్లో అదీ లార్డ్స్‌లో రెండు సార్లు టై కావడం అస్సలు ఊహించలేం. ఆట ఆరంభం నుంచి ముగిసే వరకు ఉత్కంఠ ఊపేసింది. 102 ఓవర్లు ఊపిరి బిగపట్టాల్సి వచ్చింది. ఫలితం న్యూజిలాండ్‌కు హృదయ విదారకంగా ఉంటుంది. చివర్లో కేన్ విలియమ్సన్ భావోద్వేగాన్ని మనం గమనించొచ్చు. ఎంతో ఆవేదన చెందాడు. ఐతే కివీస్ ప్రదర్శన పట్ల గర్వపడాలి. ప్రపంచకప్ మొత్తం అద్భుతంగా ఆడింది. ఇంగ్లాండ్‌ను అనేందుకు ఏమీ లేదు. కొన్ని పరిణామాలు వారికి అనుకూలంగా చోటు చేసుకున్నాయి. కఠిన పరిస్థితుల్లో వారు నిలిచారు. వారి ఆటను తక్కువ చేయొద్దు. ఒక పరాజితగా కివీస్‌ను చూడొద్దు. వారి తెలివైన, అద్భుతమైన ఆటకు సంబరాలు చేసుకోవాలి. సవ్యంగా సాగిన విషయాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి’ అని వెటోరీ తెలిపాడు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- ఆ ‘ఈగ’ పరమ అసహ్యంగా ఉంది!
- శ్వేతసౌధంలో ఏకాకి!
- విశ్వసుందరి.. జోజిబిని టుంజీ
- ఆ ఉరితాళ్లు.. నిర్భయ దోషులకేనా?
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయా?
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- గుర్రమెక్కుతుంటే బాదేశారు... తాళి కడుతుంటే ఆపేశారు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
