
తాజా వార్తలు
లండన్: ప్రపంచకప్ హీరో బెన్‌స్టోక్స్‌కు బ్రిటన్ ప్రభుత్వం అత్యున్నత పురస్కారం అందించనుందా? క్రికెట్ పుట్టిల్లు ఇంగ్లాండ్ దశబ్దాల కలను నిజం చేసిన అతడు ఇక ‘సర్ బెన్‌స్టోక్స్’ కానున్నాడా? పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయి. లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన అంతిమ సమరంలో స్టోక్స్ వీరోచితంగా పోరాడాడు. మందకొడి పిచ్‌పై వికెట్లు పడుతున్నా, ఒత్తిడి చిత్తు చేస్తున్నా 98 బంతుల్లో 84 పరుగులతో అజేయంగా నిలిచాడు. మ్యాచ్ టై చేశాడు. ఆ తర్వాత టై అయిన సూపర్ ఓవర్లోనూ 8 పరుగులు సాధించాడు. మ్యాచ్‌లో ఎక్కువ బౌండరీలు చేసిన ఇంగ్లాండ్‌ను ఐసీసీ చివరికి విజేతగా ప్రకటించింన సంగతి తెలిసిందే. స్టోక్స్ ప్రదర్శనకు ముగ్ధులైన బ్రిటన్ జాతీయ నేతలు బోరిస్ జాన్సన్, జెరెమీ హంట్ అతడికి అత్యున్నత పురస్కారం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. థెరెసా మే నిష్క్రమణతో వీరిద్దరూ బ్రిటన్ ప్రధాని రేసులో ముందున్నారు.
‘నేను డ్యూక్డోమ్స్ ఇస్తాను. ఏదైనా సరే అత్యున్నతమైందే ఇస్తాను. గార్టర్ కింగ్ ఆఫ్ ఆర్మ్స్ అయినా సరే’ అని జాన్సన్ అన్నారు. దిసన్, టాక్ రేడియో ఏర్పాటు చేసిన నాయకత్వ చర్చలో అడిగిన ర్యాపిడ్ ఫైర్ ‘అవును, కాదు’ ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ‘స్టోక్స్ నైట్‌హుడ్‌కు అర్హుడేనా’ అన్న ప్రశ్నకు జాన్సన్ ‘కచ్చితంగా, నా జవాబు అవును’ అని చెప్పారు. ఇదే ప్రశ్నకు హంట్ ‘ఆఫ్కోర్స్’ అని సమాధానం ఇచ్చారు. ఇప్పటి వరకు 11 మంది క్రికెటర్లకు నైట్‌హుడ్ ఇచ్చారు. చివరి సారి ఇంగ్లాండ్ మాజీ టెస్టు సారథి అలిస్టర్ కుక్కు దీనిని ప్రధానం చేశారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- కొండముచ్చు మృతితో గ్రామస్థుల కంటతడి
- వెస్టిండీస్ ఘన విజయం
- చైనా సూర్యుడు
- పునరుజ్జీవనం పొందిన వెనిషియన్ గాజు
- హైదరాబాద్‌లో విద్యార్థుల ఆందోళన
- జపాన్‌లో రానా బర్త్‌డే సెలబ్రేషన్స్
- చిన్నోడికి.. పెద్ద కష్టం..
- ఉరితీసే అవకాశమివ్వండి.. రక్తంతో లేఖ
- ‘పౌరసత్వ’ సెగ.. దిల్లీలో ఉద్రిక్తం
- బిర్యానీ అమ్మవద్దంటూ దళితుడిపై దాడి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
