
తాజా వార్తలు
లండన్: ప్రపంచకప్ గెలిపించిన బెన్‌స్టోక్స్ తనకొచ్చిన పేరు, ప్రఖ్యాతులను చూసి మురిసిపోవద్దని ఇంగ్లాండ్ క్రికెట్ డైరెక్టర్ ఆండ్రూ స్ట్రాస్ హెచ్చరించాడు. స్టార్డమ్తో గాల్లో తేలిపోకుండా కాస్త నేలపైనే ఉండాలని సూచించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో స్టోక్స్ 84 పరుగులతో అజేయంగా నిలిచిన సంగతి తెలిసిందే. బౌండరీల సంఖ్య ఆధారంగా గెలిచిన ఈ పోరులో అతడు వీరోచితంగా పోరాడాడు. 2015 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ దారుణ ఓటమి తర్వాత ఆండ్రూస్ట్రాస్ క్రికెట్ డైరెక్టర్‌గా ఎన్నికయ్యాడు. భయం లేని క్రికెట్‌ను పరిచయం చేసి ఫలితం రాబట్టాడు. ఆటగాళ్లకు సంబంధించిన అన్ని విషయాలను దగ్గరుండి పర్యవేక్షించాడు.
ఈ ఒత్తిడి కష్టం
‘ఇప్పుడొస్తున్న ప్రశంసల వరదను దాటుకొని ముందుకు వెళ్లడం బెన్‌స్టోక్స్‌కు చాలా కష్టం. ఫ్రెడ్డీ ఫ్లింటాఫ్ సైతం ఇలాంటి భారాన్నే అనుభవించాడు. అతడు అంచనాల్ని బాగానే అందుకొని ముందుకు సాగిపోవడం గొప్ప విషయం. ఇకపై ఆడే ప్రతి మ్యాచ్‌లో స్టోక్స్‌పై మరింత ఎక్కువ ఒత్తిడి నెలకొంటుంది. అదో పెద్ద భారంగా మారుతుంది’ అని స్ట్రాస్ అన్నాడు.
ఎదురుచూశా!
అనవసర విషయాల్లో తలదూర్చి బ్యాడ్‌బాయ్ ముద్ర వేసుకున్న స్టోక్స్ ఇకపై అలాంటి వివాదాల్లో చిక్కుకోవద్దని స్ట్రాస్ సూచించాడు. ‘‘మీకో విషయం తెలుసా! స్టోక్స్‌తో కలిసి నేను పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం ఇప్పుడే గుర్తు చేసుకున్నా. అతడి సతీమణి క్లేర్‌తో కలిసి అతడు జైలు నుంచి ఎప్పుడు తిరిగొస్తాడా అని ఎదురుచూశా. బయటకు రాగానే అతడి వ్యక్తిత్వం గురించే ఆలోచించా. ఎందుకంటే అతడు నా వద్ద నిలబడి ‘నేనెంతో పెద్ద తప్పు చేశా. నేను చేసిందానికి క్షమాపణలు కోరుతున్నా’ అని చెప్పాడు’’ అని స్ట్రాస్ వెల్లడించాడు.
అందరూ కోరుకునే వ్యక్తి
‘ఆ వివాదం అతడి మంచికే జరిగిందని ఆ క్షణం అనుకున్నా. స్టోక్స్ ఏ దారిలో వెళ్తాడని తెలుసుకోవడం చాలా కష్టం. ఇలాంటి సందర్భాల్లో జనాలు సాధారణంగా రెండు దారుల్లో వెళ్తుంటారు. బెన్ గురించి తెలిసినవారికి, కలిసి ఆడిన సహచరులకు అతడెంత అద్భుతమైన వ్యక్తో తెలుస్తుంది. అతడికి కచ్చితంగా తమ జట్టులోనే ఉంచుకోవాలని కోరుకుంటారు. వివాదాల నుంచి బయటపడ్డ చివరి 12 లేదా 18 నెలల్లో అతడిలో జీర్ణించుకుపోయిన కాంక్ష, గెలవాలన్న తపన తగ్గకపోవడాన్ని మేం గమనించాం. ప్రపంచకప్ ఫైనల్లో జరిగిందాన్ని బట్టి అతడికి విముక్తి లభించిందని చెప్పొచ్చు. నేను మాత్రం అత్యున్నత వేదికపై అతడు ఇంగ్లిష్ క్రికెట్ ప్రతిభను ఆవిష్కరించాడని అనుకుంటున్నా’ అని స్ట్రాస్ పేర్కొన్నాడు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం..
- 8 మంది.. 8 గంటలు
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- ఆనమ్ మీర్జా మెహందీ వేడుకలో సానియా తళుకులు
- సినిమా పేరు మార్చాం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
