close

తాజా వార్తలు

భూకంపం నుంచి తప్పించుకున్నాను

సల్మాన్‌ ప్రేయసి ఉలియా వంతూర్‌

ముంబయి: బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ ప్రేయసిగా ప్రచారంలో ఉన్న ఉలియా వంతూర్‌ భూకంపం నుంచి తప్పించుకున్నారట. పని నిమిత్తం ఇండొనేసియా వెళ్లిన ఉలియా.. బాలిలోని ఓ హోటల్‌లో బస చేశారు. ఆ సమయంలో 5.7 తీవ్రతతో భూమి కంపించింది. కానీ అదృష్టవశాత్తు ఎవ్వరికీ ఏమీ కాలేదు. కాసేపటికే అంతా సర్దుకుంది. ఈ విషయాన్ని ఉలియా ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు.

‘ఉదయం భయంకరమైన అలారమ్‌తో నిద్రలేచాను. ప్రస్తుతం నేనున్న బాలి ప్రదేశంలో 5.7 తీవ్రతతో భూమి కంపించింది. కొన్ని క్షణాల పాటు ఎన్నో ఆలోచనలు బుర్రలో తిరిగాయి. కానీ నేను దేవుడిపై భారం వేసి మౌనంగా ఉండాలనుకున్నాను. ఎలాంటి చెడు జరగదని నా మనసుకు అనిపిస్తూనే ఉంది. అనుకున్నట్లుగానే దేవుడి దయ వల్ల ఎవ్వరికీ ఏమీ కాలేదు. కొన్ని క్షణాల్లోనే అంతా సాధారణ స్థితికి వచ్చింది. ఈరోజు నేను షూటింగ్‌కి ఏమీ కానట్లే వెళ్లాను. కానీ నేనింకా బతికే ఉన్నానని ఇప్పటికీ మనసులో అనుకుంటూనే ఉన్నాను. ఏదేమైనా ఈరోజు నాకు మళ్లీ పుట్టినట్లుంది. అందుకే ఈ అందమైన బాలి ప్రదేశంలో ఫొటోషూట్‌ దిగాను’ అని పేర్కొంటూ ఓ వీడియోను పోస్ట్‌ చేశారు.

రొమేనియాకు చెందిన ఉలియా సల్మాన్‌తో రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె సల్మాన్‌తో పాటు భారత్‌కు వచ్చి ఆయన కుటుంబంతోనే కలిసి ఉన్నారు. దాంతో అందరూ వారు పెళ్లి చేసుకుంటారనే అనుకున్నారు. కానీ సల్మాన్‌ మాత్రం పెళ్లి ప్రస్తావన ఎప్పుడూ తేలేదు. ప్రస్తుతం ఉలియా సల్మాన్‌ సాయంతో సినిమాల్లో నటిస్తున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘రాధా క్యూ గోరీ మై క్యూ కాలా’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

View this post on Instagram

Wake up to life!!! Today I’ve got a v shaky “alarm” in the morning. Bali, the place where I am right now, got affected by a 5.7 magnitude earthquake. In only few seconds thousands of thoughts were “shaking” my mind but I decided to stay calm and have faith. I felt v clearly that nothing bad is gonna happen and it will pass the way it came. Thank God no one got injured this time, all went back to normal in few minutes. Sometimes we need a reminder! Life can be only this much!!! So... enjoy it and make the most of it. Today! I went on with my schedule, like “nothing” happened but deep inside I felt that I’m more alive today. Today, I ve done a nice photoshooting and I’ve discovered a bit more of beautiful #bali #iuliavantur #kantolampowaterfall @bali_whereisnikita

A post shared by Iulia Vantur (@vanturiulia) on


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.