close

తాజా వార్తలు

పీపీఏలపై అసత్య ప్రచారం: చంద్రబాబు

అమరావతి‌: రాష్ట్ర ప్రయోజనాలు, భావితరాల కోసం తాము విద్యుత్‌ ఒప్పందాలు కుదుర్చుకుంటే.. వైకాపా ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తోందని ప్రతిపక్ష నేత, తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. కర్ణాటకలో సొంత విద్యుత్‌ సంస్థలు ఉన్న జగన్‌ అక్కడ ఎక్కువ ధరకు ఎలా ఒప్పందం కుదుర్చుకున్నారని నిలదీశారు. నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ ప్రజలకు అందించాలని తాము తపిస్తే.. రెండు నెలల్లోనే వ్యవస్థను అస్తవ్యస్థం చేసి చీకటి రోజులను తెచ్చారని చంద్రబాబు ధ్వజమెత్తారు. పీపీఏలపై  పునఃసమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అమరావతిలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.

విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల్లో తమ దగ్గర ఎలాంటి క్విడ్‌ ప్రోకోలు లేవనే విషయం జగన్‌ గుర్తుపెట్టుకోవాలని చంద్రబాబు అన్నారు. కర్ణాటకలో తన కంపెనీకి ఎక్కువ డబ్బులు తీసుకుని లాభం చేకూర్చుకుని.. ఇక్కడేమో అవినీతి అని గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. రెండు నెలలుగా విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడే పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై ఉన్న ప్రేమ ఆంధ్రప్రదేశ్ పై జగన్ ప్రభుత్వానికి లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం తాము ఒప్పందాలు చేసుకున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. సంప్రదాయేతర ఇంధనాన్ని 5శాతానికి మించి తీసుకోరాదని రాష్ట్ర అధికారి ఎందుకు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆయన నిలదీశారు. విద్యుత్ తక్కువ ధరకు లభించేలా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం అసత్యాలతో ఏదో విధంగా తెలుగుదేశంపై బురద చల్లే కార్యక్రమం చేపట్టిందని విమర్శించారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్రం సూచనల మేరకే సంప్రదాయేతర ఇంధన వనరులు పై దృష్టి సారించామన్నారు. 

న్యాయకమిషన్‌ సాధ్యం కాదు

ముఖ్యమంత్రి జగన్‌ ఏర్పాటు చేస్తామన్న న్యాయ కమిషన్‌ సాధ్యం కాదని, టెండర్ల విషయంలో జడ్జిలు జోక్యం చేసుకోరని చంద్రబాబు వెల్లడించారు.  ఒప్పందాలన్నీ రెగ్యులేటరీ కమిషన్ ద్వారానే జరిగాయని ఆయన స్పష్టం చేశారు. పీపీఏల విషయంలో ప్రభుత్వ పాత్ర నామమాత్రమని, ప్రజలకి తెలుగుదేశం ప్రభుత్వం ధరలు పెంచినట్లు అవాస్తవాలు చెబుతున్నారని మండిపడ్డారు. వైకాపా నాయకులు సాంకేతిక విషయాలపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, వక్రీకరించి బురదచల్లుతున్నారని ధ్వజమెత్తారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.