close

తాజా వార్తలు

ఏపీలో మరో కొత్తస్కీమ్‌..వైఎస్సార్‌ నవోదయం

జ్యుడిషియల్‌ కమిషన్‌ ముసాయిదాకు ఆమోదం
ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

అమరావతి: ఏపీ కేబినెట్‌ సమావేశం కొనసాగుతోంది. సీఎం జగన్‌ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. కీలకమైన జ్యుడిషియల్‌ కమిషన్‌ ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. టెండర్ల ప్రక్రియలో పారదర్శక విధానానికి శ్రీకారం చుట్టామని.. అవినీతిపై పోరాటంలో గొప్ప అడుగు వేశామని మంత్రివర్గం అభిప్రాయపడింది. హైకోర్టు జడ్జి లేదా రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలో టెండర్లను పరిశీలిస్తామని పేర్కొంది. రూ.100 కోట్లకు పైబడిన ప్రాజెక్టులను జ్యుడిషియల్‌ కమిషన్‌ పరిధిలోకి తీసుకురావాలని.. జడ్జికి సహాయంగా నిపుణులను అందివ్వాలని నిర్ణయించింది. టెండర్ల విషయంలో జడ్జి సిఫార్సులను సంబంధిత శాఖ తప్పనిసరిగా పాటించాలనే విధంగా చట్టం చేయనున్నట్లు పేర్కొంది. 15 రోజుల్లో టెండర్‌ ప్రతిపాదన ఖరారు చేసి, ఆ తర్వాత బిడ్డింగ్‌ ఆహ్వానించాలని కేబినెట్‌ నిర్ణయించింది. అర్హత ఉన్న కాంట్రాక్టర్లు అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. 
ఎంఎస్‌ఎఈలకు ఊరటగా..
రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊరటగా కొత్త పథకం తెచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దానికి ‘వైఎస్సార్‌ నవోదయం’గా నామకరణం చేసింది. మూడేళ్లుగా ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేందుకు వీలుగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. జిల్లాల వారీగా 86 వేల ఎంఎస్‌ఎంఈల ఖాతాలను గుర్తించారు. రూ.4వేల కోట్ల రుణాలను వన్‌టైమ్‌ రీస్ట్రక్చర్‌ చేయనున్నారు. ఎన్‌పీఏలుగా మారకుండా, ఖాతాలు స్తంభించకుండా దీని ద్వారా చర్యలు చేపట్టనున్నారు. దీంతో ఎంఎస్‌ఎంఈలకు మరింత రుణంతో పాటు తక్షణ పెట్టుబడి అందే అవకాశం కలగనుంది. అవకాశాన్ని వినియోగించుకునేందుకు ఎంఎస్‌ఎంఈలకు 9 నెలల వ్యవధి ఇవ్వనున్నారు.

ఏపీఈడీబీ రద్దు.. ఏపీఐపీఎంఏకు ఆమోదం

మరోవైపు ఏపీఈడీబీ-2018 చట్టం రద్దు చేయాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. దాని స్థానంలో ఏపీ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌, మానిటరింగ్‌ యాక్ట్‌(ఏపీఐపీఎంఏ)కు ఆమోదం తెలిపింది. పెట్టుబడుల ఆకర్షణ, బ్రాండింగ్‌, ప్రాజెక్టులకు అనుమతి, నిధుల సమీకరణ, పరిశ్రమల కాలుష్యంపై నియంత్రణ, విధానాల రూపకల్పనే లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేయనున్నారు. సీఎం ఛైర్మన్‌గా, ఏడుగురు డైరెక్టర్లతో ఏపీఐపీఎంఏ బోర్డును నియమించనున్నారు. డైరెక్టర్లలో ఆర్థిక, పరిశ్రమల శాఖ మంత్రులు, సీఎస్‌ ఉండనున్నారు.

మరికొన్ని నిర్ణయాలు

* విద్యా సంస్థల పర్యవేక్షణ, నియంత్రణ ముసాయిదా బిల్లులకు కేబినెట్‌ ఆమోదం. చట్టం ద్వారా పర్యవేక్షణ, నియంత్రణకు త్వరలో కమిషన్‌ ఏర్పాటు.

* ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతికి కేబినెట్‌ మరో కీలక నిర్ణయం. కాంట్రాక్టులు, సర్వీసు కాంట్రాక్టుల్లో 50 శాతం వారికే ఇవ్వాలని యోచన. దీనికోసం కొత్త చట్టానికి ఆమోదం.

* అన్ని నామినేటెడ్‌ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యం.

* రజకులు, బ్రాహ్మణులు, టైలర్లకు ఆర్థికసాయం కింద ఏటా రూ.10వేలు ఇచ్చేందుకు కేబినెట్‌ అంగీకారం.

 

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.