close

తాజా వార్తలు

ఇంగ్లాండ్‌ జట్టుకు ట్రిపుల్‌ హెచ్‌ గిఫ్ట్‌

 డబ్ల్యూడబ్ల్యూఈ మాజీ ఛాంపియన్‌ అరుదైన బహుమతి

లండన్‌: ఐసీసీ 12వ వన్డే ప్రపంచకప్‌ గెలిచి తొలిసారి క్రికెట్‌ ఛాంపియన్‌గా అవతరించిన ఇంగ్లాండ్‌ క్రికెట్‌ జట్టుకు డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్‌ ట్రిపుల్‌ హెచ్‌ సర్‌ప్రైజ్‌ చేశాడు. డబ్ల్యూడబ్ల్యూఈ ప్రపంచ ఛాంపియన్‌ బెల్ట్‌ను ఇంగ్లాండ్‌ జట్టుకు అంకితం చేశాడు. ఈ మేరకు ట్విటర్‌ ద్వారా ఇయాన్‌మోర్గాన్‌ సేనకు అభినందనలు తెలిపారు. 

‘ఇదో అత్యద్భుతమైన టోర్నమెంట్‌, చూడచక్కని ఫైనల్‌ మ్యాచ్‌. ఛాంపియన్‌గా అవతరించడానికి అన్ని అర్హతలు కలిగిన జట్టు. ప్రపంచకప్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ క్రికెట్‌ జట్టుకు అభినందనలు. ఈ సందర్భంగా డబ్ల్యూడబ్ల్యూఈ ప్రపంచ ఛాంపియన్‌ బెల్ట్‌ మీకోసమే’ అని ట్వీట్‌ చేశాడు. 

గత ఆదివారం లార్డ్స్‌ మైదానం వేదికగా జరిగిన ఆసక్తికర వన్డే ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌ జట్టు తొలిసారి ప్రపంచకప్‌ను గెలిచింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఈ ఉత్కంఠపోరులో రెండు జట్లూ సూపర్‌ ఓవర్‌లోనూ సమాన స్కోర్‌ సాధించడంతో బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లాండ్‌ విజేతగా అవతరించింది. ఇంగ్లాండ్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌(84 నాటౌట్‌) మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికైన విషయం తెలిసిందే.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.