
తాజా వార్తలు
పరిశీలిస్తున్న ఎంసీసీ అధికారులు
లండన్: క్రికెట్ చట్టాల్లోని ఓవర్ త్రో నిబంధనల్లో సవరణలు చేసే దిశగా మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) అధికారులు అడుగులు వేస్తున్నారు. క్రికెట్ చట్టాలను రూపొందించే ఎంసీసీ అధికారులు తదుపరి జరిగే చట్ట సవరణలో ఓవర్ త్రో అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఇంగ్లాండ్ X న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఆఖరి ఓవర్లో ఓవర్ త్రో ఘటన చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎంసీసీ అధికారులు ఓవర్ త్రో నిబంధనల్లో సవరణలు చేసే దిశగా పరిశీలిస్తున్నారని టైమ్స్ లండన్ పత్రిక పేర్కొంది.
గత ఆదివారం లార్డ్స్ మైదానంలో జరిగిన వన్డే ప్రపంచకప్ చివరి ఓవర్లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ బెన్‌స్టోక్స్ బ్యాటింగ్ చేస్తుండగా మూడు బంతుల్లో తొమ్మిది పరుగులు అవసరమయ్యాయి. నాలుగో బంతిని డీప్‌మిడ్ వికెట్ మీదుగా ఆడిన స్టోక్స్ రెండు పరుగులకు ప్రయత్నించాడు. అదే సమయంలో ఫీల్డర్ మార్టిన్ గప్తిల్ విసిరిన బంతి స్టోక్స్ బ్యాట్‌కు తాకి బౌండరీ చేరింది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ తీసిన రెండు పరుగులతోపాటు ఓవర్ త్రో వల్ల అదనంగా నాలుగు పరుగులు ఆ జట్టుకు కలిసివచ్చాయి. అనంతరం ఇంగ్లాండ్ జట్టు మ్యాచ్‌ను టైగా ముగించింది. ఆపై నిర్వహించిన సూపర్ ఓవర్లోనూ ఇరు జట్ల స్కోర్లు సమానమైన నేపథ్యంలో బౌండరీల సంఖ్య ఆధారంగా ఆతిథ్య జట్టు తొలిసారి ఛాంపియన్‌గా అవతరించింది.
ఈ ఓవర్ త్రో వల్ల ఇంగ్లాండ్‌కు ఆరు పరుగులకు బదులు ఐదు పరుగులే ఇవ్వాల్సిందని, అంపైర్లు తప్పుచేశారని ప్రముఖ సీనియర్ అంపైర్ సైమన్ టోఫెల్ అభిప్రాయపడ్డారు. ఏదైనా కారణం చేత ఓవర్ త్రో వల్ల బంతి బౌండరీ చేరితే ఆ పరుగులతో పాటు అప్పటికే బ్యాట్స్‌మెన్ పూర్తిచేసిన పరుగులను లెక్కించి వారికి కేటాయిస్తారు. అయితే ఫీల్డర్ బంతిని త్రో చేసే సమయానికి బ్యాట్స్‌మెన్ ఒకర్నొకరు దాటి పరుగు చేస్తేనే ఆ పరుగును లెక్కిస్తారు. ఇదే విషయాన్ని సైమన్ టోఫెల్ పేర్కొన్నాడు. ఈ ప్రపంచకప్ ఫైనల్స్‌లో గప్తిల్ త్రో విసిరేసరికి రెండో పరుగుకు ప్రయత్నించిన బ్యాట్స్‌మెన్ ఇద్దరూ ఒకర్నొకరు దాటలేదు. దీంతో ఇంగ్లాండ్ జట్టుకు ఐదు పరుగులే వస్తాయని సైమన్ వివరించారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- ఆ ‘ఈగ’ పరమ అసహ్యంగా ఉంది!
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ఆ ఉరితాళ్లు.. నిర్భయ దోషులకేనా?
- విశ్వసుందరి.. జోజిబిని టుంజీ
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయా?
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- గుర్రమెక్కుతుంటే బాదేశారు... తాళి కడుతుంటే ఆపేశారు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
