close

తాజా వార్తలు

నేనెక్కడ పనిచేయాలో మీరే చెప్పేస్తారా?

మీడియాపై ప్రశాంత్‌ కిషోర్‌ విసుర్లు

దిల్లీ: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ మీడియా, వార్తా పత్రికలపై మండిపడ్డారు. ప్రస్తుతం ఆయన శివసేన యువనేత ఆదిత్య ఠాక్రేతో కలిసి పనిచేస్తున్నారని ఓ పత్రిక రాసింది. ఆ వార్తను ఉద్దేశిస్తూ ప్రశాంత్‌ మాట్లాడారు. తనకు మీడియా అంటే ఎంతో గౌరవం ఉందని, ఇలాంటి వార్తల గురించి విన్నప్పుడు చాలా బాధగా అనిపిస్తుందన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘నిజం చెప్పాలంటే ఈ మధ్య నేను ఎక్కడ పనిచేస్తున్నానో నాకంటే బాగా మీడియాకే తెలుస్తోంది. వార్తా పత్రికల్లో చదవి తెలుసుకోవాల్సి వస్తోంది’ అని అన్నారు. ఈ విషయంపై ఆయన ట్విటర్‌లోనూ స్పందించారు.

కొన్ని రోజుల్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగున్నాయి. ఈ నేపథ్యంలో శివసేన నేత ఆదిత్య ఠాక్రేతో కలిసి ప్రశాంత్‌  పనిచేస్తున్నారని ఓ మీడియా రాసింది. జన ఆశీర్వాద్‌ యాత్ర పేరుతో చేపట్టే కార్యక్రమానికి ప్రశాంత్‌ వ్యూహకర్త అని అందులో పేర్కొంది. దీంతో ఈ అంశంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈయన ఐపాక్‌(భారత రాజకీయ కార్యాచరణ కమిటీ) పేరుతో ఓ బృందాన్ని నడుపుతున్నారు. రాజకీయ వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్న ఈయన పశ్చిమ బెంగాల్‌ అధికార పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్ కోసం పనిచేయనున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.