
తాజా వార్తలు
దిల్లీ: ప్రపంచకప్‌లో టీమిండియా ప్రదర్శనపై సమీక్షించేందుకు సమావేశం ఏర్పాటు చేయడం లేదని సుప్రీం కోర్టు నియమించిన పాలకుల కమిటీ స్పష్టం చేసింది. అందుకు సమయం లేదని పేర్కొంది. ఇంగ్లాండ్‌లో నిర్వహించిన ప్రపంచకప్‌లో కోహ్లీసేన విస్మయకరంగా ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో టాప్ ఆర్డర్, మిడిలార్డర్ విఫలం కావడంతో ఫైనల్ చేరలేకపోయింది. ఆటగాళ్లు తిరిగొచ్చిన తర్వాత సమీక్ష నిర్వహిస్తామని అప్పట్లో వినోద్ రాయ్ తెలిపారు. కానీ ఇప్పుడు వీలు కాదంటున్నారు.
‘సమీక్ష నిర్వహించేందుకు సమయం ఎక్కడుంది?’ అని వెస్టిండీస్ పర్యటనకు టీమిండియా బయల్దేరిన తర్వాత రాయ్ అన్నారు. ‘సహాయ సిబ్బంది నుంచి సాధారణ ఫీడ్‌బ్యాక్, మేనేజర్ల నివేదిక కోసం ఇంకా ఎదురుచూస్తున్నాం’ అని ఆయన తెలిపారు. సీఓఏ సమావేశం ముగిసిన తర్వాత కమిటీ సభ్యులు సుప్రీం కోర్టు నియమించిన అమికస్ క్యూరీ పీఎస్ నరసింహను కలిసేందుకు వెళ్లారు.
‘నిర్దేశించిన గడువులోపు రాష్ట్ర సంఘాల ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సాయం చేయడంతో పాటు పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంపై ఏం చేయాలో అమికస్ క్యూరీ సుప్రీంను కోరతారు’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఈ కారణంగానే సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ ఏదో ఒక పదవికి ఎంచుకోవాలని బీసీసీఐ అంబుడ్స్‌మన్ డీకే జైన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- జయలలితగా రమ్యకృష్ణను చూశారా?
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- ‘అతను నన్ను చంపాలని చూస్తున్నాడు’
- రణ్‌బీర్‌కు ఆలియా అప్పుడే తెలుసు..!
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- భయం.. కోపం రెండూ వస్తున్నాయి!
- భారీ ప్రక్షాళనకు కార్యాచరణ
- అలాంటివాటిపై దృష్టి సారిస్తే నష్టమే:మమత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
