close

తాజా వార్తలు

జనసేన బలోపేతంపై పవన్‌ దృష్టి!

29 నుంచి నేతలతో వరుస భేటీలు 

అమరావతి: జనసేనను సంస్థాగతంగా మరింతగా బలోపేతం చేయడంపై ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా నిన్న పొలిట్‌బ్యూరో, పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీలను ప్రకటించిన పవన్‌.. ఈ నెల 29 నుంచి పార్టీ కమిటీలు, నేతలు, పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. మంగళగిరి, విజయవాడలోని పార్టీ కార్యాలయాల్లో ఈ సమావేశాలు నిర్వహించనున్నట్టు శనివారం మధ్యాహ్నం ఆ పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. పార్టీ నిర్మాణంలో భాగంగా క్రియాశీలక కార్యకర్తలు, ముఖ్యనేతలతో ఆయన చర్చించనున్నారు. 

జనసేన బలోపేతం కోసం చేపట్టే కార్యక్రమాల నిర్వహణ గురించి ముఖాముఖి చర్చలు నిర్వహించనున్నారు. ఈ నెల 29న ఉదయం 11 గంటల నుంచి పార్టీ నాయకులు, వివిధ కమిటీల సభ్యులతో పవన్‌ సమావేశం కానున్నారు. అదేరోజు సాయంత్రం 4గంటలకు పార్టీ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ సమావేశం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరుగుతుంది. 30న ఉదయం 11 గంటలకు నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం, 4 గంటలకు కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం, 31న ఉదయం 11 గంటలకు రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గం సమావేశాలు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్నారు. 

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.