
తాజా వార్తలు
దిల్లీ: ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో వివాదంపై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం స్పందించారు. అసహనంపై నెట్టింట్లో చర్చ జరుగుతోన్న నేపథ్యంలో ఆ సంస్థకు మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘ఇప్పటి వరకు నేను ఫుడ్ ఆర్డర్ చేయలేదు. కానీ ఇప్పుడు జొమాటో నుంచి తెప్పించుకోవాలనుకుంటున్నాను’ అని ట్విటర్లో పేర్కొన్నారు. ఆయన ట్వీట్‌ను వేలమంది లైక్ చేయడంతో పాటు రీట్వీట్ చేశారు. దీనిపై ఆయన్ను కొంతమంది ప్రశంసించగా, ఇంకొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు.
మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్కు చెందిన అమిత్ శుక్లా అనే వ్యక్తి జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ హిందువు కాదన్న నెపంతో ఆర్డర్‌ను రద్దు చేశాడు. అయితే ఆ కారణంతో డెలివరీ బాయ్‌ను మార్చడానికి ఆ సంస్థ ఒప్పుకోలేదు. అంతేకాకుండా..‘ఆహారానికి ఎలాంటి మతం ఉండదు’ అని ట్వీట్ చేసింది. అయితే అమిత్ నుంచి వివరణ కోరుతూ పోలీసులు ఆయనకు నోటీసులు పంపించాలని నిర్ణయించుకున్నారు. మతం కారణంగానే అమిత్ ఆర్డర్‌ను రద్దు చేసి ఉంటే, ఇతరుల మనోభావాలను దెబ్బతీసినందుకు ఆయనపై చర్యలు తీసుకుంటామని వారు వెల్లడించారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- నిర్భయ దోషులకు త్వరలో ఉరి
- భాజపాకు తెరాస షాక్!
- ‘అమిత్ షాపై ఆంక్షల్ని పరిశీలించండి’
- శరణార్థులకు పౌరసత్వం
- లూప్ ఎంతకాలం ఉంచుకోవచ్చు?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
