
తాజా వార్తలు
భోపాల్: ఫుడ్ డెలివరీ చేసే వ్యక్తి హిందువు కాదని వెనక్కి తిప్పి పంపిన వ్యక్తికి మధ్యప్రదేశ్ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి ఈ తరహా వ్యాఖ్యలు చేస్తే జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఈ మేరకు అతడికి నోటీసులు పంపారు. రాబోయే ఆరు నెలల్లో మళ్లీ ఈ తరహా ట్వీట్లు చేస్తే జైల్లో పెడతామని అందులో పేర్కొన్నారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా, మతపరమైన విద్వేషాలు రేకెత్తించే ఈ తరహా వ్యాఖ్యలు తగవని సూచించారు.
హిందూ ఫుడ్ డెలివరీ బాయ్‌ని పంపని కారణంగా మధ్యప్రదేశ్‌కు చెందిన అమిత్ శుక్లా జొమాటో ఆర్డర్‌ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా ట్వీట్ చేశాడు. దీనిపై జొమాటో సైతం ఘాటుగానే స్పందించింది. ఆహారానికి మతం ఉండదని బదులిచ్చింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా అసహనంపై చర్చకు దారితీసింది. పలువురు జొమాటో చర్యను సమర్థించగా.. మరికొందరు ఆ కంపెనీ రేటింగ్‌లు తగ్గించే చర్యలు చేపట్టారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయా?
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- గుర్రమెక్కుతుంటే బాదేశారు... తాళి కడుతుంటే ఆపేశారు!
- ఉసురు తీశాడు.. ఉరిపోసుకున్నాడు
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
