close

తాజా వార్తలు

పెళ్లి కోసం ఒత్తిడి చేశారని యువకుడు దారుణం

మోగా: పంజాబ్‌లోని మోగాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహం చేసుకోవాలని ఒత్తిడిచేయడాన్ని భరించలేక సందీప్‌ సింగ్‌ (27) అనే యువకుడు ఐదుగురు కుటుంబ సభ్యుల్ని తుపాకీతో కాల్చి చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో అతడి తల్లి, తండ్రి, సోదరి, నాన్నమ్మ సహా మూడేళ్ల మేనకోడలు కూడా ప్రాణాలు కోల్పోయారు. అతడి తాత గాయపడగా.. ఆస్పత్రిలో చేర్పించారు. అతడి ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఈ దురాగతానికి ఒడిగట్టేందుకు అతడు ఆ తుపాకీని బంధువుల నుంచి దొంగిలించినట్టు పోలీసులు తెలిపారు. ప్రాథమికంగా పోలీసులు తెలిపిన ప్రకారం.. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి నపుంసకుడు అని సమాచారం. అయితే, డిసెంబర్‌లో అతడికి వివాహం చేయాలని నిర్ణయించగా.. దీన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. దీంతో గత కొన్ని రోజులుగా వారితో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే యువకుడు ఈ దురాగతానికి పాల్పడ్డాడు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.