close

తాజా వార్తలు

జూడాల ఆందోళనలో ఉద్రిక్తత!

జూనియర్‌ వైద్యుడిపై చేయి చేసుకున్న డీసీపీ

విజయవాడ: కేంద్రం ప్రవేశపెట్టిన జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) బిల్లుకు వ్యతిరేకంగా జూనియర్‌ వైద్యులు చేస్తున్న ఆందోళనలో అపశ్రుతి చోటుచేసుకుంది. విజయవాడలోని ఎన్టీఆర్‌ ఆరోగ్య వర్సిటీ ఎదుట జూడాలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. బెంజిసర్కిల్‌ నుంచి రామవరప్పాడు వరకు జూడాల ఆందోళనతో ఈ ఉదయం పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. దీంతో మహానాడు రోడ్డులో మానవహారం చేపడుతున్న వైద్యులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో డీసీపీ హర్షవర్ధన్‌ ఓ జూనియర్‌ వైద్యుడిపై చేయి చేసుకున్నారు. మరికొందరిని బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించారు.

పోలీసులు అతిగా ప్రవర్తించి శాంతియుతంగా చేస్తున్న తమ ఆందోళనను ఉద్రిక్తంగా మార్చారంటూ జూడాలు ఆందోళనకు దిగారు. దీనిపై విచారణ జరిపించాలని, భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని, లేకుంటే ఆందోళనను ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు. దీనిపై డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.