
తాజా వార్తలు
ఏడు వికెట్లతో చెలరేగిన దక్షిణాఫ్రికా క్రికెటర్
లీసెస్టర్: దక్షిణాఫ్రికా క్రికెటర్, లీసెస్టర్షైర్ కెప్టెన్ కొలిన్ అకర్మన్న్ టీ20 క్రికెట్లో అద్భుత బౌలింగ్ గణంకాలు నమోదు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. బుధవారం బర్మింగ్హామ్ బేర్స్ జట్టుతో లీసెస్టర్షైర్ ఫాక్సెస్ తలపడిన కౌంటీ క్రికెట్ టీ20లీగ్లో కొలిన్ 18 పరుగులిచ్చి ఏడు వికెట్లతో చెలరేగాడు. దీంతో టీ20 క్రికెట్లో ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా చరిత్ర సృష్టించాడు. ఇతడికన్నా ముందు 2011లో మలేసియా బౌలర్ అరుల్ సుప్పయ్య ఐదు పరుగులకే ఆరు వికెట్లు తీసిన రికార్డును బద్దలు కొట్టాడు.
ఇదిలా ఉండగా బుధవారం జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లీసెస్టర్షైర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. హారీ స్విండెల్స్(63; 50 బంతుల్లో 6X4), లెవిస్ హిల్(58, 28 బంతుల్లో 4X4, 3x6) చెలరేగడంతో బర్మింగ్హామ్ జట్టు ముందు భారీ లక్ష్యం నిర్దేశించింది. అనంతరం కొలిన్ చెలరేగడంతో బర్మింగ్హామ్ జట్టు 17.4 ఓవర్లలో 134 పరుగులకు కుప్పకూలింది. కొలిన్ రెండు ఓవర్లలో ఆరు వికెట్లు తీయడంతో బర్మింగ్హామ్ ఆఖరి 20 పరుగుల వ్యవధిలో ఎనిమిది వికెట్లు కోల్పోయింది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- విడాకులిప్పించి మరీ అత్యాచారం...
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- స్నానాల గదిలో సీసీ కెమెరా ఏర్పాటుకు యత్నం
- రివ్యూ: వెంకీ మామ
- బాలీవుడ్ భామతో పంత్ డేటింగ్?
- ఎన్కౌంటర్పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- ఇండిగో విమానం 9 గంటల ఆలస్యం
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- బంజారాహిల్స్లో రౌడీషీటర్ దారుణ హత్య
ఎక్కువ మంది చదివినవి (Most Read)
