
తాజా వార్తలు
ముంబయి: నాలుగేళ్ల బాలుడు అమాయకత్వంతో చేసిన పని నెటిజన్ల మనసు దోచుకుంటోంది. ఫుడ్ డెలివరీ చేసే కంపెనీ.. తనకు కావాల్సిన కార్లూ బొమ్మలు కూడా ఇస్తుందనుకున్నాడో లేదా పొరపాటున చేశాడో తెలీదు గానీ.. ఆ బాలుడు తనకు కావాల్సినవన్నీ మెసేజ్ చేశాడు. దీనిపై స్పందించిన జొమాటో పిల్లాడి కోరికను తీర్చింది.
విషయంలోకి వెళ్తే.. ముంబయికి చెందిన ఒక చిన్నారి ప్రముఖ ఆహార పదార్థాల సరఫరా సంస్థ జొమాటోకు ఒక మెసేజ్ పంపాడు. జొమాటో తనకు నచ్చిన ఆట వస్తువులైన బెలూన్లు, కార్లు, గిఫ్ట్స్ కావాలని అందులో పేర్కొన్నాడు. అది చూసిన ఆ బాలుడి తండ్రి మెసేజ్‌ల స్ర్కీన్‌షాట్ తీసి జొమాటోకు ట్యాగ్ చేస్తూ ట్విటర్లో పోస్ట్ చేశాడు. ‘నాలుగేళ్ల నా కొడుకు అమాయకత్వంతో జొమాటోకు తనకు నచ్చిన వస్తువులు తెమ్మని మెసేజ్ చేశాడు’ అని ట్వీట్లో పేర్కొన్నాడు. ఆయన ట్వీట్‌కు జొమాటో స్పందించి ఆ బాలుడికి కావల్సిన బొమ్మలు పంపి ఆనందానికి గురిచేసింది. మరోసారి ఆ బాలుడి తండ్రి ట్విటర్లో పేర్కొంటూ.. తన కుమారుడికి జొమాటో బొమ్మలు పంపించి ఆశ్చర్యానికి గురిచేసిందని పోస్ట్ చేశారు. వాటితో బాలుడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం..
- 8 మంది.. 8 గంటలు
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- ఆనమ్ మీర్జా మెహందీ వేడుకలో సానియా తళుకులు
- నాకు సంబంధం ఉందని తేలితే ఉరేసుకుంటా
ఎక్కువ మంది చదివినవి (Most Read)
