close

తాజా వార్తలు

రణరంగంసౌండ్‌ కట్‌ ట్రైలర్‌ సూపర్‌: చెర్రీ

వీడియో చూశారా

హైదరాబాద్‌: ‘రణరంగం’ సౌండ్‌ కట్‌ ట్రైలర్‌ను కథానాయకుడు రామ్‌ చరణ్‌ విడుదల చేశారు. శర్వానంద్‌ హీరోగా నటిస్తున్న సినిమా ఇది. కాజల్‌, కల్యాణి ప్రియదర్శన్‌ కథానాయికలు. సుధీర్‌ వర్మ దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది.

కాగా ఈ సినిమా సౌండ్‌ కట్‌ ట్రైలర్‌ను చెర్రీ ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సౌండ్‌ కట్‌ అద్భుతంగా. చాలా కొత్తగా ఉంది. మొన్న విడుదలైన ట్రైలర్‌ కూడా నాకు నచ్చింది. మేం శర్వాను ఎలా చూడాలనుకున్నామో అలానే ఉన్నాడు. శర్వా నటించిన ‘కో అంటే కోటి’ నాకు ఇష్టం. ఆ చిత్రంలో అతడిలోని తీవ్రత నాకు బాగా నచ్చుతుంది. ఇప్పుడు మళ్లీ అదే తీవ్రతతో ఈ సినిమాలో నటించాడు. సుధీర్‌ వర్మ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రశాంత్‌ పిళ్లై కూడా సూపర్‌ నేపథ్య సంగీతం సమకూర్చాడు. మొత్తం చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్‌’ అని చెప్పారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.