close

తాజా వార్తలు

ఇండియన్‌ ఆర్మీకి ధన్యవాదాలు చెప్పిన క్రికెటర్‌

తన బామ్మ, తాతయ్యలను క్షేమంగా చూసుకున్నారని..

దిల్లీ: దిల్లీ రంజీ జట్టు మాజీ కెప్టెన్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అసిస్టెంట్‌ కోచ్‌ మిథున్‌ మన్హాస్‌ ఇండియన్‌ ఆర్మీకి ధన్యవాదాలు చెప్పాడు. జమ్మూకశ్మీర్‌లోని భదెర్వాహ్‌లో నివసిస్తున్న తన బామ్మ, తాతయ్యలను వారం రోజులుగా ఆర్మీ అధికారులు చాలా బాగా చూసుకున్నారని ఆయన ట్వీట్‌ చేశాడు. గతవారం అధికరణ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తర్వాత జమ్మూ కశ్మీర్‌లో సమాచార వ్యవస్థల్ని నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడి వారికి బయటవారితో సమాచార సంబంధాలు తెగిపోయాయి.

అయితే తాజాగా తన బామ్మ, తాతయ్యల గురించి సమాచారం అందిందని, వారిని ఆర్మీ అధికారులు వారం పాటు చాలా బాగా చూసుకున్నారని చెప్పాడు. వారికి అవసరమైన వైద్య సేవలు అందించడంతో పాటు వీలు చిక్కినప్పుడల్లా అధికారులు కలిసి వెళ్లారని తెలిపాడు. ఈ సందర్భంగా ఆర్మీకి ధన్యవాదాలు చెప్పాడు. 

జమ్మూకశ్మీర్‌కు చెందిన మిథున్‌ మన్హాస్‌ దిల్లీ రంజీ జట్టుకు అనేక సంవత్సరాల పాటు కెప్టెన్‌గా వ్యవహరించాడు. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ అయిన అతడు మొత్తం 157 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో  45.82 సగటుతో 9,714 పరుగులు చేశాడు. అందులో 27 శతకాలతో పాటు 49 అర్ధశతకాలు ఉన్నాయి. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, దిల్లీ డేర్‌డెవిల్స్‌, పుణె వారియర్స్‌ తరఫున ఆడాడు. కాగా ఈ ఏడాది ఆరంభంలో ఆర్సీబీకి అసిస్టెంట్‌ కోచ్‌గా ఎంపికయ్యాడు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.