close

తాజా వార్తలు

‘జెట్‌ జోలికి వెళ్లడం లాభదాయకం కాదు’

ముంబయి: గల్ప్‌ వైమానిక సంస్థ ఎతిహాద్‌ సోమవారం కీలక ప్రకటన చేసింది. సంక్షోభంలో ఉన్న జెట్‌ఎయిర్‌వేస్‌లో మళ్లీ పెట్టుబడులు పెట్టబోమని పేర్కొంది. పరిష్కారం కాని సమస్యలు, రుణాల కారణంగా ఈ నిర్ణయం తీసుకొన్నామని పేర్కొంది. సంక్షోభం కారణంగా ఏప్రిల్‌ 17న జెట్‌ ఎయిర్‌వేస్‌ను మూసివేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన దివాల ప్రక్రియ మొదలైంది. ఇప్పటి వరకు దాదాపు 3 కంపెనీలు ప్రాథమికంగా బిడ్స్‌ను దాఖలు చేశాయి.  ఈ నేపథ్యంలో తాము ‘ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌’ను దాఖలు చేయలేదని వెల్లడించారు.  ప్రస్తుతం ఈ డీల్‌కు సంబంధించిన ఈవోఐలను దాఖలు చేయడానికి చివరి తేదీ ఆగస్టు 10తోనే ముగిసింది. 

‘‘జెట్‌ ఎయిర్‌వేస్‌లో పెట్టుబడి పెట్టడం ఎతిహాద్‌ బాధ్యత కాదు.. లాభదాయకం అంతకంటే కాదు.. భారత్‌కు ఇచ్చిన హామీపై ఈ నిర్ణయం ఎటువంటి ప్రభావం చూపించదు. జెట్‌కు సరైన పరిష్కారం చూపించాలని కోరుతున్నాము. మైనార్టీ షేర్‌ హోల్డర్‌ అయిన ఎతిహాద్‌కు అంత సామర్థ్యం లేదు.’’ అని ఒక ప్రకటనలో పేర్కొంది. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.